ఐటి శాఖ తాకీదులు షురూ

TAX TIME
Tax TIMe

ఐటి శాఖ తాకీదులు షురూ

 

రూ.2.5లక్షలకుపైబడిన పొదుపు డిపాజిట్లు
రూ.12.5 లక్షలకుపైబడిన కరెంటు ఖాతా డిపాజిట్లు లక్ష్యం
రూ.100 కోట్లకుపైగా ఉన్న రియాల్టీ ప్రాజెక్టులపై నిఘా
నవంబరు8 తర్వాత లావాదేవీలపైనే ఐటిశాఖ గురి

 

ముంబై,నవంబరు 17:కేంద్రప్రభుత్వం బ్యాంకులనుంచి పోస్టాఫీసు ల్లోను ఎక్కువ మొత్తాలు డిపాజిట్‌ చేసిన వారి వివరాలను కోరిం ది. ఆర్థికశాఖపరిధిలోని ఆదాయపు పన్నుశాఖ మొత్తం 2.5 లక్షలకుపైబడిన డిపాజిట్ల వివరాలుకావాలని తాఖీదులు జారీ చేసింది. కేవలం పొదుపుఖాతాల్లో మాత్రమే ఈ వివరాలున్న వాటిని నివేదికలివ్వమని అన్ని బ్యాంకులకు తాఖీదులు పంపిం చింది. అలాగే కరెంటుఖాతాల్లో 12.5 లక్షల మొత్తం కంటే ఎక్కు వ ఉన్న వారి వివరాలు అందించాలని కోరింది.

ఎక్కువ విలువ లున్న పాత కరెన్సీ నోట్లను 50రోజులలోపు బ్యాంకుల్లో డిపాజిట్‌ చేసుకోవాలన్న పిలుపును అనుసరించి ఐటిశాఖ పరిశీలనను పెం చింది. బ్యాంకులు, పోస్టాఫీసులు ఇందుకు సంబంధించిన ఆర్థిక లావాదేవీల నివేదికలు వచ్చే జనవరి 31వ తేదీలోపు అందిం చాలని ఐటిశాఖ నోటిఫికేషన్‌లో పొందుపరిచింది. భారతీయ రిజర్వుబ్యాంకు కూడా కస్టమర్లనుంచి పాన్‌కార్డ్‌ కాపీని తీసుకోవా లని 50వేలకు మించిన డిపాజిట్లపై ఈ పాన్‌కార్డును తీసుకోమని బ్యాంకర్లను కోరింది.

2.5 లక్షలకుమించిన డిపాజిట్లకు పాన్‌కార్డు లు కూడా అవసరమని తేలింది. ప్రస్తుతం పాన్‌కార్డులేకుడా 50 వేల వరకూ లావాదేవీలు నిర్వహించుకోవచ్చు. రోజుకు 50వేలకు లోబడిన డిపాజిట్లే ఎక్కువ అందుతున్నాయి. పైగా పాన్‌కార్డ్‌ నిబంధనను కూడా అధిగమించే యోచనతో ఈ విధంగా డిపాజిట్‌ చేస్తున్నారు ఈ నెల 9వ తేదీ నుంచి డిసెంబరు 30వ తేదీలోపు జరిగిన డిపాజిట్లకు ఖచ్చితంగా 2.5లక్షలు దాటితే పాన్‌ నిబం ధన వర్తిస్తుందని నోటిఫికేషన్‌ జారీచేసింది. నోట్లచెలామణి రద్దు ప్రారంభంనుంచి జరుగుతున్న డిపాజిట్లపై ప్రభుత్వం కన్నెసింది. ప్రత్యేకించి రెండున్నరలక్షలకుపైబడిన డిపాజిట్లపై ఎక్కువ నిఘా పెంచింది. 12.5 లక్షలకు మించిన కరెంటు ఖాతాలనిల్వలపై ఐటి రిటర్నులు దాఖలుచేయాలని కేంద్రప్రత్యక్షపన్నులబోర్డు మార్గదర్శ కాలు జారీచేసింది.
ఒకటిలేదా అంతకుమించిన కరెండుఖాతాల్లో జరిగిన లావాదేవీల వివరాలు తీసుకోవాలని సూచించింది. ఒకే వ్యక్తికి ఉన్న 12.5 లక్షలకు మించిన లావాదేవీలు ఈనెల 9నుంచి డిసెంబరు 30వ తేదీలోపు జరిగితే వివరాలు తీసుకోవాలని సిబి డిటి సూచించింది. ఈనెల 15వ తేదీవిడుదలయిన ఈ నోటిఫి కేషన్‌ ప్రకారం కరెంటు ఖాతాలు మినహాయించి బ్యాంకులు మొత్తం అందరు వ్యక్తులు 2.5 లక్షలకు మించి డిపాజిట్‌చేసిన వారి వివరాలను ఇవ్వాలని కోరింది. 2017 నాటికి ఆదాయపు పన్నుశాఖ వీరందరికీనోటీసులు జారీచేయాలని చూస్తోంది. ప్రత్యే కించి బ్యాంకుల్లో డిపాజిట్లు చేసినవారిపై దృష్టిపెట్టింది. డిసెం బరు 30వ తేదీ తర్వాతనుంచే ప్రారంభం అవుతాయి. ఆదా యపు పన్నుశాఖ ఇప్పటికే నవంబరు 10వతేదీ నుంచి నోటీసులు జారీచేసేందుకు సిద్ధంఅయింది.

బ్యాంకులు ఒకరోజు మూసివేసిన తర్వాత లావాదేవీలు ప్రారంభించిన రోజు నుంచి ఈ నోటీసులు జారీచేయాలని రూపకల్పనచేస్తోంది. వారి ఆదాయ పరిమితికి మించి డిపాజిట్‌ అయినపక్షంలో వారికి నోటీసులు ఇవ్వాలని నిర్ణ యించింది. నగదు లావాదేవీలు, లేదా స్థిరాస్తి కొనుగోళ్లు వంటివి ఈ సందేహాస్పద ఖాతాదారులు నిర్వహిస్తే పన్నులశాఖ నిఘా నేత్రంలో ఉంటారు. 30లక్షలకుపైబడిన స్థిరాస్తి కొనుగోలు, అమ్మ కాలపై కూడా నిఘా ఉంచింది. ఆదాయపు పన్నుశాఖ ఇప్పటి వరకూ మతపరమైన ఛారిటబుల్‌ట్రస్టులకు సైతం నోటీసులు జారీచేసింది. వారివారి ఖాతాల్లో ఉన్న నగదు నిల్వలు తెలియ జేయాలని సూచించింది. ఈనెల 8వతేదీ రూ.500, రూ.1000 నోట్లు చెలామణి రద్దునాటికి ఉన్ననిల్వల వివరాలు తెలియజేయా లని సూచించింది. ట్రస్టులు, సొసైటీలు వంటివి కూడా ఈ నిల్వ

లు తెలియజేయాలని కోరింది. మార్చి 31వ తేదీనాటికి పూర్తి లావాదేవీల వివరాలతోపాటు నవంబరు 8వ తేదీవరకూ ఉన్న వివరాలను కూడా అందించాలని సూచించింది. అలాగే 8వ తేదీ తర్వాత జరిగిన నగదుపూర్వక లావాదేవీలు, లేదా చెల్లింపుల లావాదేవీల వివరాలు కావాలని నోటీసులు జారీచేసింది. ఢిల్లీపరి సరాల్లోని రియాల్టీలావాదేవీలపై ఐటిశాఖ నిఘాపెంచింది.

స్థిరాస్తి కొనుగోళ్లు, విక్రయాలపైనే ఎక్కువగా ఈ రద్దయిన నోట్లు వెల్లు వలా వస్తాయన్న అంచనాలతో ఈ నిఘాను మరింత ఉధృతం చేసింది. ఢిల్లీ, ఎన్‌సిఆర్‌ ప్రాంతంలోని మొత్తం అరడజనుకుపైగా ప్రాజెక్టులను తనిఖీచేసింది. విక్రయదస్త్రాలు, నగదునిల్వల వివరా లు వంటివాటిని అడిగినట్లుసమాచారం. రూ.100 కోట్లకుపైబడిన ప్రాజెక్టులపై ముందు కన్నేసిన ఐటిశాఖ ఆపై ఇతర ప్రాజెక్టులకు విస్తరిస్తోంది.

అలాగే ట్రేడర్లు, జ్యుయెలర్లు ఇతర వర్తక ప్రతినిధు ల లావాదేవీలపై కూడా ఓ కన్నేసిందనే చెప్పాలి. ఇప్పటికే ఐటిశాఖ విజిలెన్స్‌ విభాగం జ్యుయెలరీషాపులపై దాడులకు చేపట్టడంతో కర్ణాటక, కోల్‌కత్తా, గోవా, ముంబై ప్రాంతాల నుంచి చెప్పుకోదగిన మొత్తంలో రికవరీలు చేసింది. గడచిన వారంలో మొత్తం 600 మందికిపైగా జ్యుయెలర్లు వందమందికిపైగా కరెన్సీ మార్పిడి డీలర్లకు ఐటిశాఖ నోటీసులు జారీచేసింది.

గోవాలో ఒక జ్యూయెలర్‌ 90 లక్షల విలువైన నగదు, ఆభరణాల నిల్వలతో పట్టుబడ్డాడు. ముంబైకేంద్రంగా ఉండే ఈ వ్యాపారి 45 లక్షల విలువైన ఆభరణాలను గోవాలో ఒక క్లయింట్‌కు విక్రయించారు. అంతేకాకుండా పశ్చిమబెంగాల్‌లో నిర్వహించిన దాడుల్లో నాలుగు కోట్లకుపైగా నగదు నిల్వలు ఐటిశాఖ స్వాధీనం చేసుకుంది.