ఐటిఆర్‌లో మార్పులుచేస్తే కఠిన చర్యలే!

B4
Itr

ఐటిఆర్‌లో మార్పులు చేస్తే కఠిన చర్యలే!

 

న్యూఢిల్లీ, డిసెంబరు 14: పెద్దనోట్ల చెలామణి రద్దు తర్వాత దాఖలవుతున్న ఐటి రిటర్నులను సవరణలు, మార్పులు చేస్తున్నారని పరిశీలనలో తప్పులున్నట్లు తేలిందంటే కఠిన జరిమానా, ప్రాసిక్యూషన్‌ చర్యలు ఉంటాయని కేంద్ర ప్రత్యక్ష పన్నులబోర్డు హెచ్చరించింది. ఐటి రిటర్నులను మార్పులు,చేర్పులు చేస్తు న్నారన్న ఫిర్యాదులు ఎక్కువ వస్తున్న నేప థ్యంలో సిబిడిటీ ఈ మార్పులు,చేర్పులను తీవ్రంగా వ్యతిరేకించింది. నోట్లరద్దుకు ముందు దాఖలుచేసిన రిటర్నులను అస్సె స్సీలు భారీ ఎత్తున మార్పులుచేస్తున్నారని చట్టవ్యతిరేకమని సిబిడిటి హెచ్చరించింది. అంతకుముందు నివేదించిన వార్షిక ఆదా యం కానీ, ఇతరత్రా ఉన్న ఆస్తుల్లోకాని రాబడుల్లో కానీ భారీ ఎత్తున సవరణలు చేసి ఆదాయపు పన్ను మినహాయింపు పొందాలని చూస్తున్నారని సిబిడిటి వివరించింది. ఆదాయపుపన్ను శాఖ రిటర్నులను ఎట్టి పరిస్థితుల్లోను సవరణలకు తావులేదన్నారు. వాస్తవ మూలవనరులు దాచాలని చూస్తే ఎట్టి పరిస్థితుల్లోను ఉపేక్షించరని సిబిడిటి హెచ్చరించింది. ఆదావయనరులను తగ్గించడం,చేతిలో ఉన్న నగదు, నికరలాభాలు వంటి వాటిని తప్పుగా చూపడం, ఖాతాలను తారుమారుచేయడం వంటివి చెల్లబోవని కఠిన చర్యలు ఉంటాయని సిబిడిటి వెల్లడించింది. ఐటి చట్టం139(5) పరిధిలో ఒకసారి ఐటిఆర్‌ను దాఖలుచేసిన తర్వాత వాటిలో తప్పులు దొర్లినట్లు స్పష్టంగా నిర్ధారణ అయిన తర్వాత మాత్రమే మార్పులుచేసిన ఐటిఆర్‌ను దాఖలు చేయాల్సి ఉంటుంది.