ఏడేళ్ల కనిష్టానికి టాటామోటార్స్‌

TATA-
TATA-

ఏడేళ్ల కనిష్టానికి టాటామోటార్స్‌

న్యూఢిల్లీ: 2011 తర్వాత టాటామోటార్స్‌ షేరు కొత్త కనిష్టానికి చేరింది. పలు కారణాలతో ఇటీవల దేశీయ ఆటో రంగ కౌంటర్లలో ఇన్వెస్టర్లు అమ్మకాలకు మొగ్గుచూప డంతో ఈ షేరు ప్రస్తుతం ఎన్‌ఎస్‌ఇలో 17.4శాతం క్షీణించి రూ.176 వద్ద ట్రేడవుతోంది. ముఖ్యంగా బ్రిటిష్‌ లగ్జరీ కార్ల అనుబంధ సంస్థ జాగ్వార్‌ ల్యాండ్‌రోవర్‌ పనితీరు ఆధారంగా గత కొంతకాలంగా టాటామోటార్స్‌ షేరు గరిష్ట స్థాయిలను అందుకుందని విశ్లేషకులు పేర్కొ న్నారు. సెప్టెంబరులో జెఎల్‌ఆర్‌ ప్రపంచ అమ్మ కాలు 12.3 శాతం నీరిసించాయి. 57,114 యూనిట్లకు పరిమితమైనట్లు కంపెనీ తెలిపింది. చైనా నుంచి డిమాండ్‌ మందగించడం ప్రభావం చూపినట్లు పేర్కొంది. చైనాలో జెఎల్‌ఆర్‌ వాహన విక్రయాలు సెప్టెంబర్‌లో 46 శాతంపైగా క్షీణించాయి. ఇందుకు వాణిజ్య వివాదాలు, దిగమతి సుంకాల వంటి కారణమని టాటా మోటార్స్‌ వెల్లడించింది. ఉత్తర అమెరికాలోనూ 7శాతం నీరసించింది. దీనికి అనుగుణంగా పశ్చిమ మిడ్‌ల్యాండ్‌లోని ప్లాంటును రెండు వారాల పాటు మూసివేయనున్నట్లు తెలిపింది. అయినా కూడా కార్మికులను తొలగించబోమని, మూసివేత కాలానికి జీతం కట్టిస్తామని కంపెనీ తెలిపింది. అయితే సెప్టెంబర్‌లో విడిగా జాగ్వార్‌ బ్రాండ్‌ అమ్మకాలు 4.4శాతం పెరిగి, 19,146 యూనిట్లకు చేరింది. అయితే ల్యాండ్‌రోవర్‌ అమ్మకాలు మాత్రం దాదాపు 19 శాతం నీర సించి 37,968 యూనిట్లకు చేరినట్లు వివరించింది. ఇప్పుడున్న ప్రపంచమార్కెట్లలో సమస్యాత్మక పరిస్థితులు వెలువెత్తుతున్నాయని, దీంతో లాభదాయకతను నిలుపుకునేందుకు తగిన చర్యలు తీసుకుంటున్నట్లు టాటామోటార్స్‌ యాజమాన్యం వెల్లడించింది.