ఏడునెలల్లో రూ.29వేలకోట్ల పన్ను ఎగవేత

tax evasion
tax evasion

న్యూఢిల్లీ: పరోక్షపన్నుల్లో రూ.29,088కోట్లు ఎగవేతను గుర్తించినట్లు కేంద్ర పరోక్షపన్నులబోర్డు వెల్లడించింది. ఏప్రిల్‌నుంచి అక్టోబరుమధ్యకాలంలోనే భారీ ఎత్తున పన్నులు గెవేస్తున్నట్లు అధికారులుగుర్తించారు. సేవాపన్నురూపంలో 22,973కోట్లు బకాయిలున్నాయి. ఆర్ధిక మంత్రిత్వశాఖ తనిఖీ, నిఘా విభాగం పన్నులు 1835 కేసుల్లో 29,088 కోట్లు రావాలిస ఉందని గుర్తించింది. ప్రస్తుత ఆర్ధికసంవత్సరంలోనే భారీ మొత్తం ఎగవేసారని గుర్తించింది. వీటిలో జిఎస్టఇ కేసులు 571వరకూ ఉన్నాయి. వీటిలో జిఎస్‌టి డైరెక్టరేట్‌జనరల్‌ ఇంటిలిజెన్స్‌ పరంగా జరిపిన పరిశీలనలో 4562 కోట్లు రావాల్సి ఉందని అంచనావేసింది. సేవాపన్నులపరంగాచూస్తే భారీ మొత్తం రావాల్సి ఉందని అంచనావేస్తోంది. మొత్తంకేసుల సంఖ్యపరంగా సేవాలపన్నులపరంగా 1145వరకూ ఉన్నాయి. ఈ మొత్తమే రూ.22,973కోట్లవరకూ ఉంది. సెంట్రల్‌ ఎక్సైజ్‌ సుంకం పరంగాచూస్తే 119 కేసుల్లో పన్ను 1553కోట్లు ఎగవేసినట్లుగుర్తించింది. మొత్తం పరోక్షపన్నులపరంగా ఏప్రిల్‌ అక్టోబరుమధ్యకాలంలోనే రూ.29,088 కోట్లు ఎగవేసినట్లు సమాచారం. మొత్తం 5427 కోట్లను ఏడునెలల కాలంలో రికవరీచేసామని వెల్లడించింది. అంతకుముందున్నకేసుల్లో సైతం రికవరీ ఘనంగా సాగిందని అంచరనా. మొత్తం రికవరీలో 3124కోట్లు జిఎస్‌టి ఎగవేత దారులనుంచి, 2174 కోట్లు సేవాపన్నుపరంగాను రాబట్టింది. 128 కోట్లు సెంట్రల్‌ ఎక్సైజ్‌సుంకంపరంగా రాబట్టింది. ఏప్రిల్‌ అక్టోబరు నెలలమధ్యకాలంలోకూడా కేంద్ర పరోక్షపన్నులబోర్డు భారీ ఎత్తున పన్ను ఎగవేతలపై దృష్టిసారించినట్లు తెలుస్తోంది.