ఎస్బీఐ ఖాతాదారులకు ఊరట

SBI1
State Bank of India

ముంబాయి: 25కోట్ల మంది ఖాతాదారులకు ఊరటినిచ్చేలా ఎస్బీఐ సంచలన నిర్ణయం తీసకుంది. సేవింగ్‌ ఖాతాల్లో కనీస నిల్వలు పాటించని ఖాతాదారులకు విధించే చార్జీలను 70శాతం వరకు తగ్గించింది. సవరించిన చార్జీలు ఏప్రిల్‌ 1నుంచి అమల్లోకి రానున్నాయి. ఎస్బీఐ తాజా నిర్ణయంతో మెట్రో, అర్బన్‌ కేంద్రాల్లో ప్రస్తుతం విధిస్తున్న చార్జీలు రూ.50 నుంచి రూ.15 తగ్గనున్నాయి. సెమీ అర్బన్‌, గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పటి వరకు రూ.40వరకు నాన్‌ మెయింటెన్స్‌ చార్జీలు విధిస్తున్నారు. తాజాగా యధావిధిగా జీఎస్టీ అదనంగా ఉంటుంది. బ్యాంక్‌ లాభాల ద్వారా వచ్చే ఆదాయం కంటే చార్జీల ద్వారా వచ్చే ఆదాయమే అధికంగా ఉన్నట్లు వెలుగుచూడటంతో ఎస్బీఐ తీవ్ర విమర్శలు ఎదుర్కొన్న విషయం విదితమే. విద్యార్థులు, నిరుపేదలకు చెందిన ఖాతాలను సైతం రెగ్యులర్‌ సేవింగ్స్‌ ఖాతాలుగా పరిగణించడంతో భారీగా నష్టపోతున్నారు. ఈ నేపథ్యంలో కస్టమర్ల నుంచి వస్తున్న సూచనలు, మనోభావాలను దృష్టిలో ఉంచుకోని చార్జీలను తగ్గిస్తున్నట్లు ఎస్బీఐ వెల్లడించింది. రెగ్యులర్‌ సేవింగ్స్‌ బ్యాంక్‌ ఖాతా నుంచి ఎటువంటి చార్జీలు విధించకుండా ఉండే బేసిక్‌ సేవింగ్స్‌ ఖాతాలుండగా.. అందులో 16కోట్ల వరకు జన్‌ధన్‌ ఖాతాలు, బేసిక్‌ ఖాతాలే ఉన్నాయి. ఈ ఖాతాలకు కనీస నిల్వల నిబంధన లేదు.