ఎన్‌సిఆర్‌ నుంచి చిన్న ఎటిఎంలు

small ATM's
small ATM’s

ముంబయి: ఎటిఎంల తయారీ కంపెనీ ఎన్‌సిఆర్‌ కొత్తగా ఎంపికచేసిన చిన్న ఎటిఎంలను మారుమూల, గ్రామీణప్రాంతాలు, ఇప్పటివరకూ ఎటిఎంలులేని ప్రాంతాలకోసం విడుదలచేసింది. కొత్త ఎన్‌సిఆర్‌ ఎటిఎం బయోమెట్రిక్‌ గుర్తింపు డిజైన్‌చేసినట్లు తేలింది. ఎన్‌సిఆర్‌ కార్పొరేషన్‌ ఒమ్మినఛానెల్‌ పరిష్కారాలకింద సెల్ఫ్‌సెర్వ్‌ ఎంపికచేసిన క్యాస్‌ , ఎస్‌ఇ రిసైకిల్‌ ఎటిఎంలను విడుదలచేసింది.దేశంలోని బ్యాంకింగ్‌ సౌకర్యంలేని 19శాతం జనాభా అవసరాలకోసం వీటిని ఉత్పత్తిచేసినట్లు వెల్లడించింది. బ్యాంకులు ఈ ఎటిఎంలద్వారా గ్రామీణ ప్రాంతాలకు మరింత నగదుసేవా సౌకరఆయలను పంపించే అవకాశం ఉంది. భారత్‌లో రిటైల్‌ లావాదేవీలు 50శాతం జరుగుతున్నాయని, వీటన్నింటిని నగదురూపంలోనే చేస్తున్నారని అన్నారు. మొత్తం రూ.18,500 కోట్ల రూపాయలు ఎటిఎంలనుంచి 2018లోనే విత్‌డ్రాచేసినట్లు తేలిందన్నారు. ఈ విత్‌డ్రాలు 2022నాటికి 2600 కోట్ల రూపాయలకు చేరే అవకాశం ఉందని ఎన్‌సిఆర్‌ అంచనావేసింది. ఎన్‌సిఆర్‌ రీసైకిల్‌ ఎటిఎంలు, వాటితోపాటే ఎన్‌సిఆర్‌ ఆప్టిక్యాష్‌ మదింపు పరిష్కారాలు, వంటివి ఎక్కువ అమలుచేస్తున్నట్లు ఎన్‌సిఆర్‌ వెల్లడించింది. రీసైకిల్‌ చిన్న మెషిన్ల ద్వారా చిన్న వ్యాపారులు, వినియోగదారులు తమ డిపాజిట్లుచేసుకునేందుకు అవకాశం కలుగుతోందని ఎన్‌సిఆర్‌వెల్లడించింది. రిటైల్‌, ఫైనాన్షియల్‌, ట్రావెల్‌, ఆతిధ్యరంగం, టెలికామ్‌, టెక్నాలజీ, చిన్న వ్యాపారాలకు సంబంధించి ఎన్‌సిఆర్‌ ఎటిఎంలద్వారా రోజువారి 70 కోట్ల లావాదేవీలు జరుగుతున్నాయని అంచనావేస్తోంది. అట్లాంటా కేంద్రంగా 30వేల మంది ఉద్యోగులతో నడుస్తోంది. 180 దేశాల్లో వ్యాపార లావాదేవీలునిర్వహిస్తున్నట్లు వెల్లడించింది.