ఎన్‌టిపిసి ఇడిగా రామచంద్రమూర్తి బాధ్యతల స్వీకరణ

RAMCHANDRA MURTHY
RAMCHANDRA MURTHY

ఎన్‌టిపిసి ఇడిగా రామచంద్రమూర్తి బాధ్యతల స్వీకరణ

హైదరాబాద్‌: ఎన్‌టిపిసి ప్రాంతీయ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌(సౌత్‌)గా పదవీ బాధ్యతలు చేపట్టారు. సికింద్రాబాద్‌ వద్ద ఎన్‌టిపిసి వద్ద ఈ కార్యక్రమం నిర్వహించారు.సింగ్రూలీ 2000 ఎండబ్ల్యూ డబ్ల్యూ, రిహండ్‌ 300 మెగావాట్లు, వింధ్యచల్‌ 4760 మెగావాట్ల విద్యుత్‌ ప్రాజెక్టులకు ఆయన ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌గా సేవలందించారు.ప్రస్తుతం ఎన్‌టిపిసి అతిపెద్ద సూపర్‌ థర్మల్‌ పవర్‌ ప్రాజెక్టు. కాగా రామచంద్రమూర్తి రవిశంకర్‌ యూనివర్శిటీ నుంచి మెకానికల్‌ ఇంజనీర్‌గా పట్టా పుచ్చుకు న్నారు.ఇతను 1980లో ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీరింగ్‌ ట్రైనీగా ఎన్‌టిపిసిలో చేరారు. మూడున్నర దశా బ్దాల పాటు వృత్తి జీవితంలో అనేక ముఖ్యమైన స్థానాలలో కొనసాగారు.ఎన్‌టిపిసి స్టేషన్లలో బాద ర్పూర్‌ ,ఔరైయి, నోయిడా,దుర్గాపూర్‌,తాల్చెర్‌ థర్మల్‌,సింగ్రూలీ,రిహాండ్‌,వింహైచల్లలో విధులు నిర్వహించారు.గత 36 సంవత్సరాలలో ఆయన పవర్‌ ప్లాంట్‌ ఆపరేషన్‌,పెద్ద థర్మల్‌ ,గ్యాస్‌ ఆధా రిత పవర్‌ ప్లాంట్ల నిర్వహణ విశేషమైన అనుభవం పొందారు.యుఎస్‌ఎవార్టన్లో అధునాతన నాయకత్వ అభివృద్దిలో కార్యక్రమంలో పాల్గొన్నారు. దేశ, విదేశాలలో జరిగిన అనేక ప్రీమియర్‌ సంస్థలలో శిక్షణా కార్యక్రమాలకు కూడా హాజరయ్యాడు.