ఎగవేతదారులకు మరిన్ని ఆంక్షలు

TAX
TAX

న్యూఢిల్లీ: బ్యాంకుల వద్ద కోట్లాదిగా అప్పులు తీసుకొని అవి చెల్లించకుండా విదేశాలకు పరావుతున్న ఉద్దేశపూర్వక ఎగవేతదారులపై మరిన్ని ఆంక్షలు వస్తున్నాయి. అందుకోసం పాస్‌పోర్ట్‌ చట్టంలోని సెక్షన్‌ 10కు సవరణలు చేస్తున్నారు. ఈ ప్రకారం చూస్తే పరిమితికి మించి ఎవరైతే రుణాలు ఎగవేస్తున్నారో వారివల్ల ఆర్థిక ప్రజాప్రయోజనాలకు సైతం ప్రమాదం ఉందని వారిపై మరిన్ని ఆంక్షలు విధిస్తున్నారు. ఇలాంటి బకాయిల పరిమితి రూ.50కోట్లుగా నిర్ణయించారు. ఆ మొత్తం దాటితే పాస్‌పోర్టులు కూడా వాటంతట అవే రద్దవుతాయి. ఇప్పటికే రూ.100కోట్ల కన్నా ఎక్కువ విలువైన ఆర్థిక నేరాలకు పాల్పడేవారి ఆస్తులను, వారి బినామీ ఆస్తులతో సహా జప్తు చేయడానికి కేంద్రం ఆర్థిక నేరగాళ్ల బిల్లు తీసుకొచ్చిన సంగతి విదితమే. ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ సెక్రటరీ రాజీవ్‌ కుమార్‌ నేతృత్వంలో ఏర్పాటు చేసిన కమిటీ తాజాగా ఈ ప్రతిపాదనలు రూపొందించింది. పాస్‌పోర్టుల రద్దు విషయంపై కూడా సెక్షన్‌ 10 డీల్స్‌ను చర్చిస్తున్నామని తెలిపారు. రూ.50 కోట్లు, ఆపై రుణుల తీసుకున్న వారి పాస్‌పోర్టు వివరాలు అందించాలని కేంద్ర ప్రభుత్వం, బ్యాంకులను కోరింది. ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీలో ఆర్‌బిఐ ప్రతినిదులు, హోం, విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖ ప్రతినిధులు, ఇడి, సిబిఐ ప్రతినిధులు ఉన్నారు. పిఎన్‌బిలో రూ.14వేల కోట్ల కుంభకోణానికి పాల్పడిన నీరవ్‌మోడీతో పాటు, విజ§్‌ుమాల్యా, మరికొంత మంది ప్రమోటర్లు బ్యాంకులకు వేల కోట్లు ఎగవేసి, విదేశాలకు పారిపోయారు. వారిపై చర్యలు తీసుకునేందుకు, వారు అసలు భారత్‌కు రావడం లేదు. దీంతో ముందస్తు జాగ్రత్తలుగా రూ.50కోట్ల కంటే ఎక్కువ రుణాలు కలిగి ఉన్న ఎన్‌పిఎ అకౌంట్లు ఎవేవీ ఉన్నాయో విచారణ చేయాలని ఆర్థిక మంత్రిత్వశాఖ, ప్రభుత్వ రంగ బ్యాంకులను ఆదేశించింది.