ఉపాధి రంగంలో ఐదు లక్షల కొలువులు

employment
employment

ముంబయి: పెద్ద నోట్ల రద్దు(డిమో), జిఎస్‌టి అమలువల్లదెబ్బతిన్న ఉపాధి కల్పన తిరిగి 2018లో రికవరీ అవుతుందని నియామకాల సంస్థలు పేర్కొంటున్నాయి. సిబ్బంది,ఎగ్జిక్యూటివ్‌నియామకాల సంస్థలు కొత్త కొలువులకు తమకు కంపెనీలు సిఫారసులు చేస్తున్నట్లు వెల్లడిస్తున్నాయి. విభిన్నరంగాల్లో ఈ ఏడాది ఐదులక్షలమందికి పైగా ఉపాధి కల్పించే అవకాశం ఉంది. ఉత్పత్తిరంగం, స్పానింగ్‌, విద్యుత్‌,యుటిలిటీ, టెక్నాలజీ, ఇ-కామర్స్‌, ఆర్ధికరంగసేవలు, సూక్ష్మచిన్నమధ్యతరహా వ్యాపారాలు, ఎఫ్‌ఎంసిజి, ఫార్మా, హెల్త్‌కేర్‌ జీవశాస్త్రవిభాగాల్లో ఈ నియామకాలుంటాయని సంస్థలుచెపుతున్నాయి. ఆర్ధికవ్యవస్థలో స్థిరత్వం చోటుచేసుకోవడం, 2018లో కొంతమేరఉపాధిపై ఆశలు పెరుగుతున్నాయని రాండ్‌స్టడ్‌ ఇండియా ఎండిసి సిఇఒ సాల్‌ డూపియస్‌ వెల్లడించారు. కొత్త కొలువలపరంగా ఐటి, ఉత్పత్తిరంగం, ఫార్మా, విద్యుత్‌రంగాల్లో ఈ ఏడాది 3.75 లక్షల కొత్త ఉద్యోగాలు రావచ్చని అంచనావేసారు. ఉత్పత్తిరంగపరంగా ఈ ఏడాది రెండులక్షల సంఘటితరంగ కొలువులు వస్తాయని, రక్షణరంగం, భారీ పరిశ్రమలు, ఎలక్ట్రానిక్స్‌ అసెంబ్లింగ్‌యూనిట్లు ఎక్కువసంఖ్యలో వస్తున్నాయి,అలాగే ఈ రంగాల్లో పరిశోధన అభివృద్ధి విభాగాలు కూడా పెరుగుతున్నందున ఇంజనీర్లు, వృత్తినిపుణులకుమంచి గిరాకీ లభిస్తుందని అంచనావేసింది. పునరుత్పత్తి విద్యుత్‌రంగంలో 20వేల వరకూ సాంకేతిక ఉద్యోగాలు వస్తాయని అంచనా. సోలార్‌,పవనవిద్యుత్‌రెండింటితోపాటు పంపిణీరంగంలో కూడా ఉంటాయని అంచనా. ఐటిరంగపరంగా 1.5 లక్షల ఉద్యోగాలు వస్తున్నాయి. సైబర్‌సెక్యూరిటీ, మెషిన్‌ లెర్నింగ్‌, ఆర్టిఫిషియల్‌ ఇంటిలిజెన్స్‌, డేటా సైన్స్‌, అనలిటిక్స్‌ రంగాల్లో ఈ కొలువులు ఉంటాయని అంచనా. భారత్‌లోని ఔషధరంగ పరిశ్రమల్లోఐదువేలవరకూ వృత్తినిపుణుల ఉద్యోగాలు వస్తాయని అంచనా. ఆర్‌అండ్‌డి రంగానికే ఎక్కువప్రాధాన్యం ఉంది. సిబ్బంది నియామకంలో కీలకమైన గ్జెఫెనో సంస్థ ఆర్ధికరంగ సేవలపరంగా 2018లో 2.65 లక్షలవరకూ కొత్త కొలువులు రావచ్చని అంచనా. ఇక ఫిన్‌టెక్‌, ఎన్‌బిఎఫ్‌సిలు కూడా 1.25 లక్షల కొత్త ఉద్యోగాలు ప్రకటించనున్నాయని, వీటిలో టెక్నాలజీ, సేల్స్‌ వృత్తినిపుణులకుమంచి డిమాండ్‌ఉంటుందని అంచనా. ఇకామర్స్‌పరంగా చూస్తే 60వేలకుపైగా ఉద్యోగాలు వస్తాయని అంచనా. బహుళజాతి సంస్థలు ఎక్కువ భారత్‌వైపు దృష్టిసారిస్తున్నాయి. ఐటిసేవల్లోమంచి డిమాండ్‌ ఉంది. ఇక ఎఫ్‌ఎంసిజి,వినియోగరంగ కంపెనీల్లో కూడా 20వేలకుపైబడిన ఉద్యోగాల డిమాండ్‌ ఉందని,ప్రత్యేకించి రెండు,మూడోతరంనగరాల్లో ఈ డిమాండ్‌ ఎక్కువ ఉంటుందని అంచనావేసారు. చిన్న,హైపర్‌స్థానికవ్యాపారాల్లో కొత్త సంవత్సరంలో నియామకాలు పెరుగుతాయని అంచనా. వర్క్‌నియర్‌బై ఆన్‌లైన్‌జాబ్‌ సంస్థ వ్యవస్థాపకులు అశిష్‌ అగర్వాల్‌మాట్లాడుతూ గత ఏడాది 15వేల ఉద్యోగాలు అందుబాటులోనికి వచ్చినా పెద్దనోట్ల రద్దు చిక్కులు తెచ్చిందన్నారు. తిరిగి కోలుకుందని ఈ రంగంలో రెండులక్షల ఉద్యోగాలు వస్తాయన్నారు. ఇక టీమ్‌లీజ్‌ సేవలసంస్థ సహవ్యవస్థాపకులు రితుపర్ణచక్రవర్తి మాట్లాడుతూ క్యాంపస్‌ నియామకాలుఈ ఏడాది10-20శాతంపెరుగుతాయన్నారు. గతమూడేళ్లనుంచి మందగమనంతో ఉన్న ఈ నియామకాలు అక్టోబరు నవంబరులనుంచి పెరుగుతాయని అన్నారు. ఐఐఎంలలో 30శాతం పెరుగుతుందని, అహ్మదాబాద్‌, బెంగళూరు, కోల్‌కత్తాల్లో ఎక్కువ ఉంటుందన్నారు. ఎన్‌ఎంఐఎంఎస్‌, ఐఐఎం ట్రిచి, ఎస్‌ఐబిఎంలవంటివాటినుంచి 20శాతంనియామకాలు పెరుగుతాయని అన్నారు. ఐఐటిలనుంచి 25శాతానికి మించిన ఆఫర్లు వచ్చాయని, కీలకరంగాలైనుత్పత్తి, పెట్రోలియం, మౌలికవనరులు,మైనింగ్‌రంగాల్లో ఎక్కువ ఉంటాయని అంచనావేసారు. సైబర్‌సెక్యూరిటీ అనలిస్టులకు మంచి డిమాండ్‌ఉంది,నెట్‌వర్క్‌ అనలిస్ట్‌,మెషిన్‌ లెర్నింగ్‌ ఇంజనీర్‌,క్లౌడ్‌ ఇంజనీర్‌, టెక్నికల్‌ సపోర్టు స్పెషలిస్టు, అసెస్‌మెంట్‌మేనేజర్‌వంటి కీలక పోస్టులకు ఎంతో డిమాండ్‌ఉందని కాంప్‌టిఐఎ ఇండియారీజినల్‌ డైరెక్టర్‌ ప్రదిఈప్తోచక్రవర్తి వెల్లడించారు.