ఉత్పత్తిరంగంలో టెక్నాలజీదే కీలకపాత్ర

technology
technology

ఆరేళ్లలో లక్షకోట్ల డాలర్లకు భారత్‌ ఉత్పత్తిరంగం!
న్యూఢిల్లీ: భారత్‌ పరంగా ఉత్పత్తిరంగంలోని స్థూల విలువలజోడింపు(జివిఎ)ను లక్షకోట్ల డాలర్లకు పెంచేలక్ష్యంతోముందుకుపోతోంది. 2025-26 నాటికి ఈ లక్ష్యం చేరుకోగలమని అంచనా. భారత్‌ ఉత్పత్తిరంగంలో ఇటీవలికాలంలో నెలకొన్న వృద్ధిని ప్రామాణికంగా తీసుకుని మరింత ప్రగతిపథంలోనికి రావాలనిచూస్తంది. అంతేకాకుండా పాలసీ మద్దతుతోపాటు టెక్నాలజిపరంగా పారిశ్రామికరంగం 4.0 టెక్నాలజీవైపు వెళ్లేదిశగా ప్రభుత్వంప్రోత్సహిస్తోంది. స్థూల విలువలజోడింపు 3రెట్లు పెరిగి లక్షకోట్లకు రావడం అంటే సమిష్టి వార్షికవృద్ధి 12వాతంగా ఉండాలి ప్రస్తుతం ఉనన 7-8శాతంనుంచి భారీ దిశగా కదలాల్సి ఉంటుంది. ఇందుకోసం ఉత్పత్తిరంగం వృద్ధితోపాటు బహుళరంగాల వృద్ధి అనివార్యం అవుతున్నది. అంతర్జాతీయ ఎగుమతులు కూడా మరింతగాపెరగాల్సి ఉంటుంది. దేశీయ వినియోగరంగ అవసరాలకు అనుగుణంగా ఉత్పత్తిని సాధించడం, ఎగుమతులను కూడా చేసుకోగలిగేస్థాయికి పెంచుకోవాల్సి ఉంటుంది. ఇటీవలికాలంలో ఎక్కువసంస్థలు ఉత్పత్తిరంగం కంటే సేవలరంగ సంస్థలపైనే ఎక్కువ పెట్టుబడులుపెడుతున్నాయి. ముందు పారిశ్రామికరంగంలో టెక్నాలజీ వృద్ధి అవసరం అవుతుంది. ఉత్పాదకతను పెంచాల్సి ఉంటుంది. ఇతరత్రా ప్రభుత్వం పోటీతత్వాన్ని పెంచి వ్యాపారనిర్వహణ వ్యయాన్ని తగ్గించాల్సిన అవసరం ఉంది. ఇందుకు ప్రభుత్వ పాలసీ మద్దతు కూడా అవసరంఅవుతుంది. ఇక కీలకరంగాల్లో భారత్‌ 30-40శాతం దిగుమతులపైనే ఆధారపడుతోంది. విద్యుత్‌ ఉత్పత్తి, ఉక్కు, ఇతర ఖనిజవనరుల ఉత్పత్తిరంగంలో టెక్నాలజీ ప్రమేయం అవసరం అవుతున్నది. హైప్రెసిషన్‌ మెషినింగ్‌ స్టేషన్లు, వంటి వాటికిసైతం టెక్నాలజీని వర్తింపచేయాలని సూచిస్తున్నారు. భారతీయ ఉత్పత్తిరంగానికి టెక్నాలజీ కొరతను పూరించాల్సిన అవసరం ఉందని నిపుణుల అంచనా. ఇక ఇప్పటికే భారత్‌లో ఉన్న మేకిన్‌ ఇండియా, స్కిల్‌ ఇండియా, డిజిటల్‌ ఇండియా వంటివాటితోపాటు టెక్నాలజీ వృద్ధి అత్యంత కీలకం అవుతుందని నిపుణులు చెపుతున్నారు.