ఈక్విటీ మార్కెట్ల నుంచి నిధులు తెచ్చుకోండి

BANKING
BANKING

ఈక్విటీ మార్కెట్ల నుంచి నిధులు తెచ్చుకోండి

న్యూఢిల్లీ,జూన్‌ 27: భారత్‌ బ్యాంకింగ్‌ రంగం లో ప్రభుత్వరంగంలో మరిన్ని బ్యాంకులు అవసరంలేదని ఐదారు ప్రపంచ స్థాయి బ్యాంకు లుంటే ఆర్థికరంగంలో పునరేకీకరణ సాధ్యమవు తుందని వివిధ మార్కెట్‌ సెక్యూరిటీ సంస్థలు విశ్లేషిస్తున్నాయి. ఎస్‌బిఐ అనుబంధ బ్యాంకుల విలీనం తర్వాత ఆర్థికశాఖ మరింతగా విలీనాలపై కసరత్తులుచేస్తోంది. ప్రభుత్వ ప్రణాళిక నిర్దేశక సంస్థ నీతిఆయోగ్‌ ప్రభుత్వరంగ బ్యాంకుల పునరే కీరణపై శ్వేతపత్రం తయారుచేసి మొత్తం విలీనాల నివేదికను అందిస్తోంది. ప్రస్తుత బ్యాంకుల విధి విధానాలు, తీరుతెన్నులు, లాభదాయకత, వాటికి పెరుగుతున్న నిరర్ధక ఆస్తులు, భౌగోళిక పరిస్థితు లు, ప్రాంతీయ సమతుల్యత, మానవవనరుల పరి వర్తన, టెక్‌ సామర్ధ్యం వంటి వాటిని పరిగణనలోకి తీసుకుంటున్నది. భారత్‌కు ఎన్నో ప్రభుత్వరంగ బ్యాంకులు అవసరం లేదని, వీటిని కుదించడం లేదా కొన్ని బ్యాంకుల్లో విలీనం చేయడం ద్వారా ప్రపంచ బ్యాంకులనుంచి పోటీ తగ్గడంతో పాటు ఇవి అంతర్జాతీయ స్థాయికి వెళ్లగల వని నిపుణుల అంచనా.

సేవలరంగంలో ప్రపంచ వాణిజ్యసంస్థతో జరిగిన డీల్‌ కారణంగాను, ద్వైపాక్షిక, ప్రాంతీయ స్వేఛ్ఛా వాణిజ్య ఒప్పందాలపరంగా ప్రపంచ బ్యాంకులు భారత్‌లో ప్రవేశిస్తున్నాయి. ఇలాంటి సందర్బాల్లో విలీనం ప్రతిపాదనలు కూడా సిసిఐనుంచి అనుమతులు పొందాల్సి వస్తోంది. క్షీణిస్తున్న బ్యాంకులను పెద్ద బ్యాంకుల్లో విలీనాలు చేయడం నష్టదాయకమేనని దీనివల్ల విలీనం తర్వాత నడిచేబ్యాంకు నష్టాలు ఎదుర్కొనాల్సి ఉం టుందన్నారు.

నరసింహం ప్యానెల్‌ నీరసిస్తున్న బ్యాంకులను మూసివేయడమే మేలని సిఫారసు చేసింది. ఎక్కువ ప్రభుత్వరంగ బ్యాంకులు స్టాక్‌ ఎక్ఛేంజిల్లో జాబితా అయ్యాయి. బ్యాంకులు తీసు కుంటున్న నిర్ణయాలు మైనార్టీ వాటాదారులకు ఎలాంటి భారం కాకుండా ఉండాలి. ప్రస్తుత వాణిజ్యవిధానం వీటికి నష్టదాయకం అయితే వాటి ని మూసివేయడమే మంచిదని అప్పటి ప్యానెల్‌ సూచించింది. ప్రస్తుతం ప్రభుత్వరంగ బ్యాంకులకు డిపాజిట్లపరంగా తాజా అనుమతులిచ్చిన పేమెంట్‌ బ్యాంకులు, స్మాల్‌ఫైనాన్‌స బ్యాంకులనుంచి ముప్పు ఎదురవుతున్నదని అన్నారు.

బ్యాంకులు పునరేకీకరణ వాటికి ఉన్న రియాల్టీ ఆస్తులను నగదురూపంలోకి మార్చడం కొంతమందికి విఆర్‌ఎస్‌ ఆఫర్లు ఇవ్వడం అనుబంధ విభాగాల విక్రయం, కీలకేతర వ్యాపారాలకు స్వస్తిచెప్పడం, బీమా, మూలధన మార్కెట్‌ విభాగాలను క్షుణ్ణంగా పరిశీలించి కొనసాగించడం వంటివి కీలకంగా ఉంటాయి. అంతేకాకుండా ప్రభుత్వ బ్యాంకులు టెక్నాలజీని కూడా ఎక్కువగా అమలుచేయాల్సిన అవసరాన్ని కొందరు స్టాక్‌ నిపుణులు చెపుతు న్నారు.

ఇక ఎన్‌పిఎలు, మొండిబకాయిల పరిస్థితి కి వస్తే మొత్తంగా ప్రభుత్వరంగ బ్యాంకుల వచ్చే రెండుత్రైమాసికాల ఎన్‌పిఎలు మరింతపెరిగే అవ కాశం ఉంది. 2017 ఆర్థిక సంవత్సరంలో నిరర్ధక ఆస్తులపెరుగుదల బ్యాంకులకు కొంత పెనుభారం గా మారుతుందనే చెప్పాలి. అందరి కళ్లు ప్రస్తుతం ఎన్‌పిఎ ఆర్డినెన్స్‌పైనే ఉన్నాయి.

ఎన్‌పిఎల పరి ష్కారానికి ఆర్‌బిఐకు మరిన్ని అధికారాలు కల్పించ డమే ఇందుకుకీలకం. ఇప్పటికిప్పుడు చూస్తే ఆర్‌బిఐ 12ఖాతాలను ఎంపికచేసి దివాళా విధానం లో ఎన్‌సిఎల్‌టికి అప్పగించింది. వీటి రుణ మొత్తాలు మొత్తం మొండిబకాయల్లో 25శాతంగా ఉన్నాయి. అంటే ఆరు.25లక్షల కోట్ల రుణ బకా యిల్లో ఈ 12 ఖాతాల్లోనే రెండు లక్షల కోట్లకు పైబడి ఉన్నట్లు అంచనా. రానురాను 8లక్షలకోట్ల కు పెరుగుతాయని భావిస్తున్నారు.

అదే ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ఆరులక్షలకోట్లకు పెరిగే అవ కాశం ఉంది. కార్పొరేట్‌ సంస్థలకు బ్యాంకర్లు కేటాయింపులు 270 బిపిఎస్‌ నుంచి 170 బిపిఎస్‌కు తగ్గుతుందని, నిరర్ధకాస్తులకు కేటా యింపులు పెరగడమే ఇందుకుకీలకమని చెపుతు న్నారు. బ్యాంకింగ్‌ వ్యవస్థలో కేటాయింపుల నిష్పత్తి 37 నుంచి 43శాతంగా ఉంటుందని, సమస్యాత్మక రుణాలు కూడా 55 నుంచి 60శాతానికి పెరుగుతాయని చెపుతున్నారు.