ఈక్విటీ మార్కెట్లపై జపాన్‌ నిక్కీ ఎఫెక్ట్‌!

SENSEX-DOWN-7
భారీ కంపెనీలన్నింటిలోను షేర్ల పతనమే
ముంబై : జపాన్‌ మార్కెట్లలో నెలకొన్న క్షీణత దేశీయ మార్కెట్లపై చూపించింది. జపాన్‌ నిక్కీ మూడేళ్ల కనిష్టస్థాయికి దిగజారింది. యెన్‌ మారకం విలువలు పటిష్టంకావడం ఎగుమతి దారుల రాబడులను దెబ్బతీయడం వంటి అంశాలు ఆసియాలోని అతిపెద్ద మార్కెట్‌ అయిన భారత్‌ మార్కెట్లపై కూడా చూపించింది. వీటికితోడు కాగ్ని జెంట్‌ నీరసించిన లాభాలు ఐటిరంగాన్ని ప్రభావి తం చేసాయి. బిఎస్‌ఇ సెన్సెక్స్‌ 266 పాయింట్లు క్షీణించి 24,021 పాయింట్లవద్ద స్థిరపడితే నిఫ్టీ 50 89పాయింట్లు క్షీణించి 7298 పాయింట్లవద్ద స్థిరపడింది. బిఎస్‌ఇ మిడ్‌క్యాప్‌, స్మాల్‌క్యాప్‌ సూచీలు 1.2నుంచి 2శాతం చొప్పున దిగజారాయి.అంతర్జాతీయ మార్కెట్లలోని పతనం భారత్‌ మార్కె ట్లపై చూపింది. ముడిచమురుధరలు కూడా మరికొంత ప్రభావంచూపించినట్లు సామ్‌కో సెక్యూరిటీస్‌ సిఇఒ జిమీత్‌ మోడి వెల్లడించారు. ఐటిరంగ షేర్లు కూడా ఎక్కు వ అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొన్నాయి. నాస్‌ డాక్‌లో జరిగిన ఎక్కువ అమ్మకాలే ఇందుకు కీలకం. టెక్నాలజీ సూచి 52వారాల కనిష్ట స్థాయికి చేరింది. ఈ అంశాలన్నీ దేశీయంగా 86 పాయింట్లు దిగజారిచేసేందుకు దోహదం చేసాయి. ముందురోజే దేశ ఆర్థికవృద్ధి 7.3శాతంగా ఉంటుం దని, అంతకుముందు త్రైమాసికాలతో పోలిస్తే మరికొంత సవరించిన అంచనాలను కేంద్రంప్రకటిం చడం కీలక రంగ షేర్లను ప్రభావితం చేసింది. జపాన్‌ బెంచ్‌మార్క్‌ సూచి నిక్కీ మూడేళ్ల కనిష్ట స్థాయిని నమోదుచేసింది. ఎక్కువ బ్యాంకింగ్‌ షేర్లు అమ్మకాల వత్తిడికి లోనయ్యాయి. నిక్కీ 5.4శాతం దిగువన 16,085.44 పాయింట్లవద్ద ముగిసింది. జనవరి 21నాటి కనిష్టస్థాయిలో ఉంది. యూరోపియన్‌ ఈక్విటీ మార్కెట్లు కూడా ఇటీవలి నష్టాలనే కొనసాగించాయి. జపా న్‌ స్టాక్స్‌క్షీణత ప్రభావం కొంత ఉంది. ఫ్రాన్స్‌ సిఎసి, లండన్‌ ఎఫ్‌టిఎస్‌ఇ, జర్మనీ డాక్స్‌ వంటివి 0.1 నుంచి 5శాతం క్షీణిం చాయి. ఐటి కంపెనీల షేర్లు నాలుగుశాతం వరకూ దెబ్బతిన్నాయి. కాగ్నిజెంట్‌ టెక్నాలజీ సొల్యూషన్స్‌ ప్రభావమే ఎక్కువ ఉంది. టిసిఎస్‌, ఇన్ఫోసిస్‌, హెచ్‌సిఎల్‌ టెక్నాలజీస్‌, టెక్‌వమీంద్ర, మైండ్‌ట్రీ వంటివి నాలుగుశాతం వరకూ క్షీణించాయి. ఇక మార్కెట్లలో కీలకంగా మారుతిసుజుకి రెండుశాతం దిగజారింది. ఉత్పత్తి 4.6శాతం దెబ్బతినడమే ఇందుకుకీలకం. లూపిన్‌ కంపనీ 4.5 శాతం ఎక్కువ ట్రేడింగ్‌ జరిగింది. కంపెనీ నికర లాభం 601 కోట్లుకు చేరడమే ఇందుకు కీలకం. సన్‌ఫార్మా రెండుశాతం, డా.రెడ్డీస్‌ 3శాతం, దిగువన ముగిసాయి. డా.రెడ్డీస్‌ ఆర్థిక ఫలితాలు మంగళవారం ప్రకటించింది. గెయిల్‌ రెండుశాతం లాభపడింది. నికర లాభం 664 కోట్లుగా ప్రకటించింది. భారత్‌ ఫోర్జ్‌ నిలకడగా ముగిసింది. డిసెంబరు త్రైమాసికంలో 15శాతం నికరలాభం క్షీణించడం ఒక కారణం అని చెప్పాలి. ఇక పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకు నిఫ్టీలో భారీగా పతనం అయింది. ఏడుశాతం క్షీణించింది. నికరలాభం 93శాతం క్షీణించి 51కోట్లుగా రావడమే ఇందుకు కీలకం. ఏడాదిక్రితం 774కోట్లుఉన్న బ్యాంకు లాభాలు భారీ గా దెబ్బతిన్నాయి. ఎన్‌పిఎలు పెరగడమే ఇందుకు కీలకం. ఇక మదర్‌సన్‌షుమి 11శాతం దెబ్బతిన్నది. నికరలాభం 21శాతం పెరిగి 307 కోట్లకు చేరినా షేర్లు క్షీణించాయి. ఇతరత్రా చూస్తే సెన్సెక్స్‌లో కోల్‌ ఇండియా, టాటామోటార్స్‌, ఎస్‌బిఐ, సిప్లా వంటివి రెండునుంచి ఐదుశాతం క్షీణించాయి.