ఈక్విటీ మార్కెట్లకు మరింతగా ఇపిఎఫ్‌ఒ పెట్టుబడులు

EPFO
EPFO

న్యూఢిల్లీ: ఇపిఎఫ్‌ఒసంస్థ కొత్త సంవత్సరంలో మరింతగా ఈక్విటీ మార్కెట్లలోపెట్టుబడులు పేట్టేందుకు నిర్ణయించింది. ఇతర సామాజిక భద్రత పథకాలు, డిజిటల్‌ విధానాలుసైతం ఈ ఫండ్స్‌ నిర్వహణకు వినియోగిస్తున్నది. ఇపిఎఫ్‌ఒ ప్రస్తుతం 15శాతం డిపాజిట్లను ఇటిఎఫ్‌లలో పెట్టుబడులుపెట్టింది ఇప్పటివరకూ రూ.55వేల కోట్లవరకూ పెట్టుబడులుపెట్టిందని అంచనా. ఇటిఎప్‌ పెట్టుబడులు సభ్యుల ఖాతాలపై ఎలాంటిప్రభావంచూపించవు. అలాగే వారి రిటైర్‌మెంట్‌ పొదుపు పెంచుకనేందుకు కూడా వీలుండదు. వారి పొదుపు మొత్తాలను స్టాక్స్‌లో పెట్టుబడులకుసైతం అవకాశం ఉండదు. ఇపిఎప్‌ఒ ఇపుడు కొత్త సాఫ్ట్‌వేర్‌ను రూపొందించింది ఇటిఎప్‌ విభాగాలతోపాటు ఇతర ఈక్విటీ ఫండ్స్‌లో కూడా పెట్టుబడులు పెట్టాలనినిర్ణయించింది. ఇటిఎఫ్‌ భాగాలను నగదును ఇపిఎఫ్‌ ఖాతాల్లో ప్రత్యేకించి చూపించాల్సివస్తే ఇపిఎఫ్‌ఒ చందాదారులకు వారు స్టాక్స్‌లో పెట్టుబడులు పెంచుకోవడం, తగ్గించుకోవడం వంటివిచేయవచ్చు. అంతకుముందు ఇదే ఏడాదిలో ఇపిఎఫ్‌ఒ నిర్ణాయక సంస్థ సెంట్రల్‌ బోర్డ్‌ ఆఫ్‌ట్రస్టీస్‌ ఈ విధానాలకు సూత్రప్రాయంగా అంగీకారంతెలిపింది. కార్మిక మంత్రి సంతోష్‌ గాంగ్వార్‌ మాట్లాడుతూ కొత్త డిజిటల్‌ విధానాలను అమలుచేయడంద్వారా కార్మికుల సర్వీసు స్థాయి, యాజమాన్యాల కేటాయింపులుసైతం సులువవుతాయని అన్నారు. 12శాతం ఉద్యోగుల కంట్రిబ్యూషన్‌ తొ0 లక్షలమంది కొత్త ఉద్యోగకలు వర్తింపచేస్తున్నట్లు తెలిపారు. ప్రధాన్‌మంత్రి రోజ్‌గార్‌ ప్రోత్సాహన్‌ యోజన కింద భారత ప్రభుత్వం ఉద్యోగుల పూర్తి ఇపిఎఫ్‌, ఇపిఎస్‌ మొత్తంగా చెల్లిస్తున్నది. ఏప్రిల్‌ 1వ తేదీనుంచి ఈ మొత్తం మూడేళ్లపాటు చెల్లిస్తుంది. ప్రస్తుత లబ్దిదారులకు సైతం ఈ విధానాన్ని వర్తింపచేస్తోంది. 2018లో పెన్షనర్ల పోర్టల్‌ ఇపిఎఫ్‌ఒ పెన్షనర్లు ఆన్‌లైన్‌లోనే పెన్షన్‌ సమాచారం తెలుసుకునేందుకు వెసులుబాటు కల్పించింది. ఇపిఎఫ్‌ఒ ్పస్తుతం 190 రకాలపరిశ్రమలను కవర్‌చేస్తోంది. 20 కోట్లమంది పిఎఫ్‌ ఖాతాలు 1.13 మిలియన్ల సంస్థలకు సంబంధించినవాటిని పర్యవేక్షిస్తోంది. ఇపిఎప్‌ఒ పరంగా 6.32మిలియన్ల పింఛనుదారుల్లో 5.53 మిలియన్ల మంది జీవన్‌ప్రమాణ్‌ కింద లబ్దిపొందితే మరో 4.94 మిలియన్లమందికి అదనంగా అనుమతులు లభించాయి.