ఇపిఎఫ్‌ వడ్డీరేటు 8.55%

EPFO
EPFO

న్యూఢిల్లీ: రిటైర్‌మెంట్‌ నిధుల సంస్థ ఇపిఎఫ్‌ఒ వడ్డీరేటును 8.55శాతంగా నిర్ణయించింది. 2018-19 ఆర్ధికసంవత్సరంలో ఆరుకోట్ల మంది చందాదారులకు ఈ వడ్డీరేటును అమలుచేస్తుందని తెలిసింది. ప్రస్తుత ఆర్ధికసంవత్సరానికి వడ్డీరేటు నిర్ణయం ప్రతిపాదన ఈనెల 21వ తేదీ జరిగే ఇపిఎఫ్‌ఒ ట్రస్టు సమావేశంలోకూడా నిర్ణయిస్తుందని సమాచారం. వడ్డీరేటు 8.55శాతంవద్దనే ఈ ఆర్ధికసంవత్సరానికి కొనసాగుతుంది. రానున్న లోక్‌సభ ఎన్నికల దృష్ట్యా కార్మికరంగ అశాంతిని నిర్మూలించి వారి ఓటుబ్యాంకుకు గండిపడకుండా బిజెపి ప్రభుత్వం ఈ అంచనాలకు వచ్చిందని సమాచారం. ఇపిఎఫ్‌ డిపాజిట్లు ఈ ఆర్ధికసంవ్తసరంలో 8.55శాతం వడ్డీతోనే ఉంటాయి. కార్మికమంత్రి ఛైర్మన్‌గా ఉన్న ఇపిఎప్‌ఒ సెంట్రల్‌ బోర్డుట్రస్టీలు ఈమేరకు నిర్ణయాన్ని ఆమోదిస్తారని అంచనా. సిబిటి ఒకసారి ఆమోదించిన తర్వాత ఆర్ధిక మ్తంరిత్వశాఖ పరిశీలనకు పంపిస్తారు. వెనువెంటనే వడ్డీరేటుప్రకారం చందాదారులఖాతాలకు జమ అవుతుంది. ఇపిఎఫ్‌ఒ ఐదేళ్ల కనిష్టంగా 8.55శాతం వడ్డీరేటు ఉందని కార్మికరంగంనుంచి డిమాండ్‌ ఎదురవుతున్నది. వడ్డీరేటును 8.65శాతం 2016-17లోనే కొనసాగుతోంది. 8.8శాతం 2015-16లో అందించింది. 2013-14లో 8.75శాతం కూడా వడ్డీరేటును అందించింది. 2014-15లో కూడా అదే వడ్డీరేటు అమలయింది. 2012-13లో మాత్రం వడ్డీరేటు 8.5శాతంగా ఉంది. కొత్త సిబిటి సమావేశంలో కొత్తఫండ్‌మేనేజర్ల ఏర్పాటుకూడా చర్చకు వస్తుంది. ఎటిఎప్‌ఒలలో ఇపిఎఫొ నిధులను పెట్టుబడిపెట్టడంపై ఫండ్‌మేనేజర్లు చర్చలుజరుపుతారు. ఇపిఎఫ్‌ఒ ఇటిఎఫ్‌లలో 2016 ఆగస్టునుంచి పెట్టుబడులు పెడుతోంది. మొత్తం నిధుల్లో 15శాతం మేర డిపాజిట్లనుంచి సొమ్మును ఇటిఎఫ్‌లలో పెట్టుబడులుపెడుతున్నది. ఇప్పటివరకూ ఇటిఎప్‌లలో సుమారు 50వేల కోట్లుపెట్టుబడులుపెట్టింది.