ఇన్‌ఫ్రా కదలికతో సిమెంట్‌ కంపెనీల షేర్లు ర్యాలీ

BAGS
ముంబై : సిమెంట్‌ కంపెనీల షేర్లు భారత లాభాల్లో ముగిసాయి. అల్ట్రాటెక్‌, అంబూజా సిమెంట్స్‌ ఆరునెలల గరిష్టస్థాయిలో ట్రేడింగ్‌ నిర్వహించాయి. వరుసగా మూడోరోజు కూడా మార్కెట్ల లో సిమెంట్‌కంపెనీలు భారీ ర్యాలీతో నడిచినట్లు తేలింది. అల్ట్రాటెక్‌ సిమెంట్‌ 3240 వద్దముగిస్తే అంబజాసిమెంట్స్‌ 228 వద్ద ముగిసింది. ఆరునెలల గరిష్టస్థాయికి ఈ రెండు కంపెనీల ధరలున్నాయి. రామ్‌కో సిమెంట్స్‌ 420 52వారాలగరిష్టంగా ఉంటే శ్రీసిమెంట్స్‌ 13,020 రూపాయలవద్ద నడిచింది. నాలుగునెలల గరిష్టంగా ఉన్నట్లు తేలింది. గడచిన మూడు ట్రేడింగ్‌లలో ఎక్కువశాతం సిమెంట్‌కంపెనీల షేర్లు ఐదుశాతం కంటే ఎక్కువ పెరిగాయి. బిఎస్‌ఇ సెన్సెక్స్‌లో 1.7శాతం కంటేఎక్కువ పెరిగినట్లు అంచనా. హోలిగేర్‌ ఇన్‌స్టిట్యూష నల్‌ రీసెర్చ్‌ అంచనాలప్రకారం చూస్తే సిమెంట్‌ రంగం 9-10 శాతంమేర పెరిగాయి. అల్ట్రాటెక్‌ సిమెంట్‌ డిమాండ్‌ పెరగడం వల్లనే వృద్ధి ఉన్నట్లు గుర్తించిం ది. జిడిపి వృద్ధికి అనుగుణంగా ఈ రంగంవృద్ధి ఆధారపడి ఉం టుంది. ప్రభుత్వం ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ప్రాజెక్టులనుపునరుద్ధరిస్తుండటం వల్ల ప్రాజెక్టుల్లో కదలిక వచ్చిం ది. అందువల్లనే ఇన్వెస్టర్లలో కూడా విశ్వాసం పెరిగిందని అంచనా. ప్రభుత్వం ఇన్‌ఫ్రా మొత్తంగాచూస్తే 28శాతం పెట్టు బడులనుపెంచుతున్నట్లు ప్రకటిం చిన సంగతి తెలిసిందే. వీటితోపాటే అందుబాటులో పక్కాగృహనిర్మాణం వంటిపథకాలు సిమెంట్‌ డిమాండ్‌ను పెంచుతున్నాయి ప్రస్తుతం ఒసిఎల్‌ఇండియా 403.05, సంఘిఇండస్ట్రీస్‌ 51.20, మంగ ళం సిమెంట్‌ 194.10, సౌరాష్ట్ర సిమెంట్‌ 53.75, డెక్కన్‌ సిమెంట్స్‌ 542.75, బిర్లాకార్పొరేషన్‌ 349.40, దాల్మియా భారత్‌ 696, ఎసిసి 1237.55, జె కెలక్షి4్మసిమెంట్‌ 305.15, ఎన్‌సిఎల్‌ ఇండస్ట్రీస్‌89.05, అంబూజాసిమెంట్స్‌ 205.80, శ్రీసిమెంట్స్‌77, అల్ట్రాటెక్‌ సిమెంట్స్‌ 295.74. 35, హెడిల్‌బర్గ్‌సిమెంట్‌ 73.05, ప్రిస్మ్‌సిమెంట్స్‌ 76.20, సాగర్‌సిమెంట్స్‌ 375.70 రూపాయలు, రామ్‌కోసిమెంట్‌ రూ.390.10, ఓరియంట్‌సిమెంట్‌ 137.45రూపాయలుగా మార్కెట్లలో కొనసాగాయి.