ఇన్ఫోసిస్‌కు షాక్‌

INFOSYS
INFOSYS

బెంగళూరు: రాజీవ్‌ బన్సాల్‌ సెవరెన్స్‌ ప్యాకేజ్‌ విషయంలో ఇన్ఫోసిస్‌కు పెద్ద యుద్ధమే వచ్చింది. కంపెనీ గవర్నెన్స్‌లు చెడిపోయాయని ఇన్ఫోసిస్‌ వ్యవస్థాపకుడు ఎన్‌ఆర్‌ నారాయణమూర్తి, కంపెనీ బోర్డుకు విరుద్ధంగా పలు విమర్శలు చేశారు. సెవరెన్స్‌ ప్యాకేజీ కింది రాజీవ్‌కు భారీ మొత్తంలో ఆఫర్‌ చేశారంటూ ఆరోపించారు. చీఫ్‌ ఫైనాన్షియల్‌ ఆఫీసర్‌గా 2015లో రాజీవ్‌ బన్సాల్‌ వైదొలిగారు. అప్పుడు రూ.17.38 కోట్ల సెవరెన్స్‌ ప్యాకేజీ ఇస్తున్నట్లు ఇన్ఫోసిస్‌ తెలిపింది. అయితే రాజీవ్‌కు కేవలం రూ.5కోట్లు మాత్రమే ఇచ్చారు. మిగతాది ఇవ్వకుండా నిలిపివేశారు. అది కూడా తనకు రావాలంటూ బన్సాల్‌ ఆర్బిట్రేషన్‌ ట్రిబ్యునల్‌ను కోరారు. బన్సాల్‌ ఫిర్యాదుకు వ్యతిరేకంగా కంపెనీ కౌంటర్‌ ఫిర్యాదును కూడా దాఖలు చేసింది. అంతకుముందు చెల్లించిన రూ.5.2 కోట్లను, ఇతర డ్యామేజ్‌లను కంపెనీకి తిరిగి చెల్లించాలంటూ బన్సాల్‌ను ఆదేశించాలని ఇన్ఫోసిస్‌ తన ఫిర్యాదులో పేర్కొంది. కానీ ఈ ఫిర్యాదును ఆర్బిట్రేషన్‌ ట్రిబ్యునల్‌ ససేమిరా అంది. అయితే ఇన్ఫోసిస్‌ మాజీ చీఫ్‌ ఫైనాన్షియల్‌ ఆఫీసర్‌ రాజీవ్‌ బన్సాల్‌కు వడ్డీతో సహా రూ.12.17 కోట్లను చెల్లించాల్సిందేనని ఇన్ఫోసిస్‌ ఆర్బిట్రేషన్‌ ట్రిబ్యునల్‌ ఆదేశించింది.