ఇక అపోలో హాస్పిటల్స్‌, యూబిఎల్‌ హైజంప్‌

apollo
apollo

ముంబై: ఈ ఏడాది మొదటి త్రైమాసికంలో అపోలోహాస్పిటల్స్‌ లిమిటెడ్‌ నికరలాభం 71 శాతం పెరిగి రూ.60కోట్లను అధిగమించింది. మొత్తం ఆదాయం కూడా 16శాతం పెరిగి రూ.1,912 కోట్లకు చేరింది. హెల్త్‌కేర్‌ సర్వీసుల ఆదాయం 12శాతం పెరగ్గా, స్టాండెలోన్‌ ఫార్మాసిస్‌ విభాగం 20 శాతం వృద్ధి సాధించినట్లు అపోలో హాస్పిటల్స్‌ పేర్కొంది. కాగా పటిష్టఫలితాలు సాధించడంతో ప్రస్తుతం అపోలో హాస్పిటల్స్‌ షేరు ఎన్‌ఎస్‌ఇలో 13 శాతంపైగా దూసుకెళ్లి రూ.1068 వద్ద ట్రేడవుతోంది. ఇంట్రాడేలో రూ.1087ను కూడా అధిగమించింది.