ఇకపై తేలిగ్గా పిఎఫ్‌ విత్‌డ్రా

EPFO
EPFO

న్యూఢిల్లీ: ఎంప్లాయీస్‌ ప్రావిడెంట్‌ ఫండ్‌ ఆర్గనైజేషన్‌ (ఇపిఎఫ్‌ఒ) తన సభ్యులకు నిబంధనలను మరింత సరళతరం చేస్తోంది. ఇంతకుముందు నిరుద్యోగిగా మారిన నెల తర్వాత 75శాతం ఇపిఎఫ్‌ కార్పస్‌ను, 2 నెలలకు పైగా నిరుద్యోగిగా ఉంటే మిగతా 25 శాతం కూడా విత్‌డ్రా చేసుకునేలా అవకాశం కల్పించిన ఇపిఎఫ్‌ఒ మరో అద్భుత అవకాశాన్ని కల్పించబోతోంది. పెళ్లికి, ఇంటి కొనుగోలుకు, పిల్లల చదువు వంటి ఖర్చులకు సగం ఇపిఎఫ్‌ మొత్తాన్ని విత్‌డ్రా చేసుకునేలా ఇపిఎఫ్‌ఒ అవకాశం కల్పించనున్నట్లు తెలుస్తోంది. అయితే నగదును విత్‌డ్రా చేసుకునేందుకు ముందస్తుగా దరఖాస్తు చేసుకోవాలి. అలాగే ఫార్మ్‌31ను నింపాల్సి ఉంటుంది. పోస్టు మెక్రటిక్యూలేషన్‌ స్టడీస్‌ కోసం 50శాతం మొత్తాన్ని వడ్డీతో తీసుకునేలా ఇపిఎఫ్‌ఒ తన నిబంధనలను మార్చుతోంది. అలాగే ఇళ్లు కొనుకునేందుకు, కట్టించుకునేందుకు కూడా 24 నెలల బేసిక్‌ వేతనాలను, డిఎను విత్‌డ్రా చేసుకోవచ్చని రిటైర్‌మెంట్‌ ఫండ్‌ తెలిపింది. 24 బేసిక్‌, డిఎ, 36 నెలల బేసిక్‌ వేతనాలను విత్‌డ్రా చేసుకునేలా ఇపిఎఫ్‌ఒ ఆప్షన్‌ను తీసుకొచ్చింది. అయితే పిఎఫ్‌ మొత్తాన్ని విత్‌డ్రా చేసుకోవాలంటే కనీసం ఐదేళ్లు సభ్యుడిగా ఉండాలి.