ఇండిగో డిస్కౌంట్‌ ఆఫర్‌

INDIGO
INDIGO

న్యూఢిల్లీ: బడ్జెట్‌ ఎయిర్‌లైన్‌ ఇండిగో డిస్కౌంట్‌ సేల్‌ ప్రకటించింది. ఈ సేల్‌లో భాగంగా 12 లక్షల సీట్ల ఛార్జీలను అత్యంత తక్కువగా రూ.1,212కే ప్రారంభించనున్నట్లు తెలిపింది. ఈ డిస్కౌంట్‌ టిక్కెట్లు 2018 జులై 25 నుంచి 2019 మార్చి 30 వరకు ప్రయాణ కాలానికి వర్తించనున్నాయి. నాలుగురోజుల పాటు జరిగే ఇండిగో సేల్‌ మంగళవారం నుంచి ప్రారంభమై, శుక్రవారంతో ముగుస్తుంది. ఈ సేల్‌ వివరాలను ఇండిగో క్యారియర్‌ తన వెబ్‌సైట్‌లో పొందుపరిచింది. అన్ని ఛానల్స్‌ ద్వారా బుక్‌ చేసుకున్న విమాన టిక్కెట్లకు ఈ ఆఫర్‌ ఉంటుందని ఇండిగో తెలిపింది. తక్కు వ విమాన టిక్కెట్‌ ఛార్జీలే కాకుండా, ఈ ఎయిర్‌లైన్‌ ఎస్‌బిఐ కార్డు ద్వారా పేమెంట్లు జరిపే బుకింగ్స్‌పై 5 శాతం క్యాష్‌బ్యాక్‌ అందించనున్నట్లుకూడా పేర్కొంది. అయితే కనీస లావాదేవీ రూ.3000మేర ఉండాలి. ఒక్కొక్కరికి 500 రూపాయల క్యాష్‌బ్యాక్‌ లభించనుంది. 2018 సెప్టెంబర్‌ 14న క్యాష్‌బ్యాక్‌ మొత్తాన్ని కస్టమర్ల అకౌంట్‌లో క్రెడిట్‌ చేయనున్నారు. దేశీయ విమానయాన సంస్థ సీట్లపై అతిపెద్ద సేల్‌ను ప్రకటించడం ఆనందాయకంగా ఉంది. ఆగస్టు 4న ఇండిగో 12వ సంవత్సరంలో అడుగు పెడుతోంది. ఈ సందర్భంగా 57 సిటీల్లో తమ నెట్‌వర్క్‌ వ్యాప్తంగా ఉన్న 12 లక్షల సీట్లను ప్రత్యేక ధరల్లో అందుబాటులో ఉంచామని ఇండిగో చీఫ్‌ స్ట్రాటజీ ఆఫీసర్‌ విలియం బౌల్టర్‌ చెప్పారు. దేశీయంగా ఇండిగో అతిపెద్ద విమానయాన సంస్థ. ప్రస్తుతం 1086 రోజువారీ విమానాలను ఇది ఆపరేట్‌చేస్తోంది. 42 దేశీయ, 8 అంతర్జాతీయ మార్గాలను ఇది కనెక్ట్‌ చేస్తోంది.