ఇండిగో కొత్త సంవత్సర సేల్‌

INDIGO
INDIGO

న్యూఢిల్లీ: దేశీయ విమానయాన సంస్థ ఇండిగో నూతన సంవత్సరం సందర్భంగా విమా న టిక్కెట్లపై ఆఫర్‌ ప్రకటించింది. ముఖ్యంగా న్యూఇయర్‌, హాలిడే డిమాండ్‌ను క్యాష్‌ చేసు కునే లక్ష్యంతో, వినియోగదారులను ఆకట్టుకు నేలా తగ్గింపు ధరలను ఆఫర్‌ చేస్తోంది. ఎంపిక చేసిన మార్గల్లో డిస్కౌంట్‌ ధరల్లో ఈ టికెట్లను ఆఫర్‌ చేస్తోంది. ఇండిగో వెబ్‌సైట్‌ సమాచారం జనవరి నెలలో అత్యధికంగా బుకింగ్‌ కోసం ఈ ధరలు అందుబాటులో ఉన్నాయి. బుకింగ్‌ పోర్టల్‌లోకి ధరల ప్రకారం ఢిల్లీ నుంచి లక్నోకి టిక్కెట్‌ ప్రారంభం ధర రూ.1030గా ఉంది. అలాగే బాగ్డోగ్రా నుంచి గౌవహటికి ప్రారంభ ధర రూ.1005గానూ, కోయంబత్తూర్‌ నుంచి చెన్నైకి రూ.1095గా ఉంది. దీంతోపాటుగా నెట్‌ బ్యాంకింగ్‌, క్రెడిట్‌ కార్డు, డెబిట్‌ కార్డుల ద్వారా జరిపే ఆన్‌లైన్‌ చెల్లింపులపై ప్రతి ప్యాసింజర్‌ కన్వీనియన్స్‌
ఫీజుగా (నాన్‌ రిఫెండబుల్‌) రూ.200 అదనంగా చెల్లించాల్సి ఉంది. మరికొన్ని విమాన సర్వీసుల టిక్కెట్‌ ధరల విషయానికి వస్తే, చెన్నై నుంచి బెంగ ళూరుకు రూ.1,120, చెన్నై నుంచి కోయం బత్తూరుకు రూ.1,148, ఢిల్లీ నుంచి జయపుర కు రూ.1,176గా ఇండిగో నిర్ణయించింది.