ఇంటర్‌సిటీ సర్వీసులకోసం వోల్వో కొత్త బస్‌

v
VOLVO

ఇంటర్‌సిటీ సర్వీసులకోసం వోల్వో కొత్త బస్‌

 

హైదరాబాద్‌, నవంబరు 22: వోల్వోబస్‌ కంపెనీ కొత్తగా ఇంటర్‌సిటీ కోచ్‌శ్రేణి బస్‌లను బెంగళూరు లో జరిగిన బస్‌వరల్డ్‌ 2016లో విడుదలచేసింది. కొత్త వోల్వో 2400 శ్రేణి మారుతున్న కస్టమర్ల అవసరాలు ప్రయాణీకుల ఆకాంక్షలకు అనుగుణం గా ఉంటుందని కంపెనీ ప్రకటించింది. 12.0ఎం కోచ్‌ నూతన ఎనిమిదిలీటర్‌ ఇంజన్‌ను విఇసివి పితంపూర్‌ కేం ద్రంనుంచి ఉత్పత్తిచేస్తోంది. బిఎస్‌ 4 నిబంధనలకు అనుగుణంగా వీటిని రూపొందించింది. భారత్‌ లో వోల్వో తన 15 ఏళ్లప్రయాణా న్ని పూర్తిచేసుకున్న సందర్భంలో కొత్తకోచ్‌లను విడుదల చేస్తున్నట్లు వోల్వో ప్రకటించింది. భారత్‌లో వోల్వోబస్సుల బాడీలు నూరుశాతం స్థానికంగానే తయారవు తున్నాయి. వోల్వోబస్‌ అధ్యక్షుడు హకన్‌ ఆగ్నే వాల్‌ మాట్లాడుతూ వోల్వో బస్సులు ఎప్పటికీ కస్ట మర్లకు ఖచ్చితవమైన విలువలు అందించే ఉత్ప త్తులే తయారుచేస్తాయని వెల్లడించారు. వోల్వో బస్‌ కార్పొరేషన్‌ బిజినెస్‌ రీజియన్‌ ఇంటర్నే షనల్‌ సీనియర్‌ ఉపాధ్యక్షుడు ఆకాశ్‌ ఫ్యాస్సీ మాట్లాడుతూ భారత్‌లో 15ఏళ్ల ప్రయాణంలో ప్రజల్లో బస్సు ప్రయాణం గురించి జాగృతి ఆమోదం తెచ్చింది. బస్సు రవాణా లావాదేవీలు బస్సు తయారీ వ్యాపా రం 2011 నుంచి భారీ మార్పులకు లోనైం దన్నారు. వోల్వో దక్షిణాసియా ఎండి విఆర్‌వి శ్రీప్రసాద్‌మాట్లాడుతూ వోల్వో బస్సులు కొత్త సాంకేతికతలు పరిచ యంచేసే దిశలో వోల్వో సరికొత్తశ్రేణిని ఆవిష్కరించామన్నారు. భారత్‌లో వోల్వో ఇప్పటివరకూ ఆరువేలకుపైగా బస్సులను విక్రయించిందన్నారు. వీటిలో 4500 కోచ్‌లున్నాయి. ముంబై, పుణె, బెంగళూరు, చెన్నై, బెంగళూరు హైదరాబాద్‌, బెంగళూరు, జోథ్‌పూర్‌, జైపూర్‌ ఢిల్లీ మార్గాల్లో వోల్వోప్రత్యామ్నాయ ప్రయాణసాధనంగా నిలిచిందని దక్షిణాసియా ప్రతినిధి వివరించారు. ప్రస్తుతం భారత్‌లో 1500 వోల్వో సిటీబస్సులు దేశంలోని 34 నగరాల్లో సంచరిస్తున్నాయని ఆయన అన్నారు.