ఆర్‌ఇసి, పిఎఫ్‌సి పైపైకి

Cabinet approves REC takeover by PFC
Cabinet approves REC takeover by PFC

న్యూఢిల్లీ, గత వారం విద్యుత్‌ రంగ ప్రభుత్వ దిగ్గజాలు రూరల్‌ ఎలక్ట్రిఫికేషన్‌ కార్పొరేషన్‌ (ఆర్‌ఇసి), పవర్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ (పిఎఫ్‌సి) మధ్య ఒప్పందం కుదరడంతో ఈ రెండు షేర్లకు డిమాండ్‌ పెరిగింది. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు మొగ్గుచూపడంతో ఈ షేర్లు కళకళలాడుతున్నాయి. ప్రస్తుతం ఎన్‌ఎస్‌ఇలో ఆర్‌ఇసి షేరు దాదాపు 5 శాతం పెరిగి రూ.148.5వద్ద ట్రేడవుతోంది. ఈ దారిలోనే పిఎఫ్‌సి షేరు కూడా 4 శాతం పెరిగి రూ.118వద్ద ట్రేడవుతోంది. పిఎఫ్‌సి చేతికి ఆర్‌ఇసి లిమిటెడ్‌లో ప్రభుత్వానికున్న 52.63శాతం వాటాను కొనుగోలు చేసినట్లు తాజాగా పిఎఫ్‌సి గత వారాంతాన తెలిపింది. ఇందుకు షేరుకి రూ.139.50చొప్పున చెల్లించేందుకు ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్లు తెలియచేసింది. డీల్‌ విలువ రూ.14,500కోట్లు కాగా, దీనిలో భాగంగా 103.94కోట్ల షేర్లను కొనుగోలు చేయనున్నట్లు వివరించింది. ఆర్‌ఇసిని పిఎఫ్‌సి కైవసం చేసుకునేందుకు 2018 డిసెంబరులో ఆర్థిక వ్యవహారాల కేంద్ర కేబినెట్‌ ఇందుకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చిన సంగతి విధితమే. దీంతో ప్రస్తుతం ఎన్‌ఎస్‌ఇలో ఈ షేరు 3 శాతం నీరసించి రూ.141వద్ద నిలవగా, పిఎఫ్‌సి కూడా ఒక శాతం క్షీణించి రూ.113వద్ద నిలిచింది.


మరిన్ని బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/business/