ఆర్‌ఇన్‌ఫ్రా ఇన్విట్‌ఫండ్‌ ఐపిఒ

ANIL AMBANI1
ANIL AMBANI

ఆర్‌ఇన్‌ఫ్రా ఇన్విట్‌ఫండ్‌ ఐపిఒ

న్యూఢిల్లీ, మే 7: అనిల్‌ అంబానీ గ్రూప్‌ కీలక కంపెనీ రిలయన్స్‌ ఇన్‌ఫ్రా ఇన్విట్‌ఫండ్‌ ఐపిఒకోసం మార్కె ట్ల నియంత్రణ సంస్థ సెబీకి దరఖాస్తుచేసింది. ఈ ఐపిఒ సైజ్‌ను రూ.3వేల కోట్ల నుంచి 2500 కోట్లకు తగ్గించింది. ఐపిఒ రూ.2500 కోట్లకు మించకుండా యూనిట్లు కేటాయిస్తుంది. అయితే అవసరమైతే 25శాతం మేర అదనపు కొనుగోళ్లకు కూడా అవకాశం ఉంటుంది. ఇన్విట్‌ నిబంధనలను అనుసరించి అవసరమైతే పరిమితులు పెంచుతామని తన ముసా యిదా దరఖాస్తుల్లో వివరించింది. గడచిన డిసెంబరు లో ఆర్‌ఇన్‌ఫ్రా సంస్థ ముసాయిదా పత్రాలను సెబీకి అందించింది. రూ.3వేల కోట్లు ఇన్‌ఫ్రా ఇన్వెస్ట్‌మెంట్‌ ట్రస్ట్‌ కింద ఐపిఒ జారీచేస్తామని వివరించింది. ఇన్విట్‌ స్కీంలు ఎక్కువగా డెట్‌తరహా పథకాలుగా ఉంటాయి. మార్కెట్లలో ట్రేడింగ్‌ చేసుకోవచ్చు. అలాగే ప్రాయో జిత సంస్థలు వ్యక్తులకు పెట్టుబడి వాహికలుగా పని చేస్తాయి. వీటిని జాబితా చేయడంవల్ల ప్రమోటర్లు ఆస్తులను కుదువపెట్టి నిధులు సమీకరించుకునే అవ కాశంఉంటుంది. ఆర్‌ఇన్‌ఫ్రా ఇన్విట్‌ఫండ్‌ నిర్వహిస్తోంది. రిలయన్స్‌ నిప్పన్‌లైఫ్‌ ఎఎంసి ఇన్వెస్ట్‌మెంట్‌ మేనేజర్‌గా వ్యవహరిస్తోంది. యాక్సిస్‌ కేపిటల్‌, డిఎస్‌పి మెరిల్‌ లించ్‌, యుబిఎస్‌ సెక్యూరిటీస్‌, ఎస్‌బిఐ కేపిటల్‌ మార్కెట్స్‌, ఎస్‌ సెక్యూరిటీస్‌ వంటివి ఉన్నాయి. ఐఆర్‌బి ఇన్‌ఫ్రా డెవలపర్స్‌ ఇన్‌ఫ్రా ఇన్వెస్ట్‌మెంట్‌ ట్రస్టు ఇప్పటికే జారీచేసిన ఐపిఒతో రూ.5వేల కోట్లు సమీకరించాలని నిర్ణయిం చిన సంగతి తెలిసిందే. అంచనాలకు మించి ఐఆర్‌బి ఇన్విట్‌ ఐపిఒకు దరఖాస్తులు అంటే బిడ్లు అందాయి.