ఆరోరోజు కూడా రికార్డు లాభాల్లోనే మార్కెట్లు

SENSEX
SENSEX

ముంబయి: స్టాక్‌మార్కెట్లలో సెన్సెక్స్‌,నిఫ్టీ రెండూ కూడా భారీ లాభాల్లోనే ముగిసాయి. జనవరి నెల కాంట్రాక్టు డెరివేటివ్స్‌ముగింపుకారణంగా కొన్ని స్టాక్స్‌పై అప్రమత్తంగా ఇన్వెస్టర్లు వ్యవహరించినా మొత్తంగా లాభాల్లోనే ముగిసాయి. ఐటిరంగ షేర్లు, బ్యాంకింగ్‌షేర్లు మద్దతునిచ్చాయి. ప్రభుత్వరంగ బ్యాంకర్లు ప్రభుత్వపరమైన పునఃమూలధనీకరణ కార్యక్రమానికి లాభపడుతుండటంతో షేర్లు అనుకోకుండాపెరిగాయి. 30షేర్‌ బిఎస్‌ఇ సెన్సెక్స్‌ 21.66 పాయింట్లుపెరిగి 36,161.64 పాయింట్లవద్దముగిసింది. 50షేర్‌ ఎన్‌ఎస్‌సి నిఫ్టీ 2.3పాయింట్ల ఎగువన 11,086 పాయింట్లవద్ద ముగిసింది. ఇంట్రాడేలో కూడా సెన్సెక్స్‌ ఆల్‌టైమ్‌ రికార్డుస్థాయి 36,268.19 పాయింట్లకుపెరిగితే నిఫ్టీ 11,110.10 పాయింట్లవద్ద స్థిరపడింది. వరుసగా ఆరోరోజు కూడా రికార్డులే స్టాక్‌ మార్కెట్లు సాధించాయి. బిఎస్‌ఇ విభాగసూచీల్లో ఐటిసూచీ ఎక్కువగా అంటే 1.53శాతంపెరిగింది. ఆ తర్వాత ప్రభుత్వరంగ సంస్థలు .13శాతం,ఎఫ్‌ఎంసిజి 0.54శాతం, టెక్‌ 0.49శాతం, పెరిగాయి. ఇతరత్రా వినియోగరంగ ఉత్పత్తులసూచీ 2.08శాతం మెటల్‌ 1.5శాతం, కేపిటల్‌గూడ్స్‌ 0.66శాతం, ఆటో 0.65శాతం చొప్పున దిగజారాయి. సెన్సెక్స్‌్‌లో టాప్‌ ఐదు లాభాలసంస్థల్లో ఎస్‌బిఐ 3.62శాతం, ఆదానిపోర్టులు 2.46శాతం, టిసిఎస్‌ 2.3శాతం, ఐటిసి 1.88శాతం, ఎస్‌బ్యాంకు 1.66శాతం పెరిగితే నష్టాలజాబితాలో భారతి ఎయిర్‌టెల్‌ 6.51శాతం, టాటామోటార్స్‌ 3.46శాతం, ఐసిఐసిఐబ్యాంకు 2.6శాతం, టాటాస్టీల్‌ 2.13శాతం, యాక్సిస్‌బ్యాంకు 1.78శాతం దెబ్బతిన్నాయి. అభివృద్ధి ఆధారిత రంగాల్లో వృద్ధి భారీగా ఉంది. ఐటి, ఫార్మారంగాల్లో స్టాక్స్‌ పెరిగాయి. త్రైమాసిక ఫలితాలపరంగా కొంత స్థిరత్వం నెలకొంది. ఇన్వెస్టర్లు ఐటిరంగంవైపే ఎక్కువ దృష్టిపెట్టినట్లు .జియోజిత్‌ ఫైనాన్షియల్స్‌ వినోద్‌నాయర్‌ వెల్లడించారు. గడచిన పదిట్రేడింగ్‌రోజులు కూడా ఎంతో సానుకూలంగానే ముగిసాయి. బడ్జెట్‌ముందు కొంత లాభాలస్వీకరణ కనిపించే అవకాశం ఉందని నాయర్‌ వెల్లడించారు. నిఫ్టీ పార్మాసూచీ నాలుగోసారి కూడాపెరిగింది. 0.5శాతానికిమించి పెరిగింది. టెలికాం సేవలసంస్థలు మరింవత దిగజారాయి. రిలయన్స్‌జియో ఇన్ఫోకామ్‌ ట్యారిఫ్‌లను మరింత తగ్గించింది. బిఎస్‌ఇ 30షేర్‌ బారోమీటర్‌ 54.30 పాయింట్లు క్షీణించి 36,085.68 పాయింట్లవద్దస్థిరపడింది. రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌,ఐసిఐసిఐబ్యాంకు, భారతీ ఎయిర్‌టెల్‌సంస్థలు దిగజారాయి. అయితే స్థిరమైన విదేశీ నిధుల రాకతో కొంత సర్దుకోగలిగాయి. ఎన్‌ఎస్‌ఇ సూచీ నిఫ్టీ కూడా 26.45 పాయింట్ల పడిపోయి 11,057.25 పాయింట్లకు చేరింది. ఇంట్రాడేలో మాత్రం 11,092.90పాయింట్లకు ఎగబాకింది. ఆసియా మార్కెట్లపరంగా ఇటీవలిలాభాలు కొంత హరించుకుఓయాయి. అమెరికా డాలర్‌ మూడేళ్ల కనిష్టస్థాయికి చేరడమే ఇందుకు మూలం. ఆసియా పసిఫిక్‌ మార్కెట్లు జపాన్‌ బైట ప్రాంతంలో 0.2శాతంపెరిగాయి. జపాన్‌నిక్కీకూడా 0.6శాతందిగజారింది. యెన్‌ బలపడటమే ఇందుకుకీలకం. అమెరికా స్టాక్స్‌ మంగళవారం ముందుకు సాగాయి. నెట్‌ప్లిక్స్‌ ఎస్‌అండ్‌ఫిని పెంచింది. నాస్‌డాక్‌ కాంపోఎజిట్‌ డౌ ఇండస్రీఇయటల్స్‌, జాన్సన్‌అండ్‌ జాన్సన్‌ ప్రాక్టర్‌ అండ్‌ గ్యాంబుల్‌ షేర్లు సైతం ముందుకు కదిలాయి. డౌజోన్స్‌ ఇండస్ట్రీయల్‌ సగటు 3.79పాయింట్లుగా ఉంది.ఎస్‌అండ్‌పి 500 6.17 పాయింట్లు లాభపడింది.నాస్‌డాక్‌ కాంపోజిట్‌ 52.26 పాయింట్లు లాభపడినట్లు మార్కెట్‌సూచీలు స్పష్టంచేస్తున్నాయి.