ఆరునెలల్లో సగటున 18.66 బిలియన్‌ డాలర్ల విక్రయం

Dollors
Dollors

రూపాయి కట్టడికి ఆర్‌బిఐ మార్కెట్‌జోక్యం ప్రణాళిక
ముంబయి: భారతీయ రిజర్వుబ్యాంకు మొదటి ఏడునెలల్లో సుమారు 18.662 బిలియన్‌ విలువైన డాలర్లను స్మార్ట్‌ మార్కెట్‌లో విక్రయించినట్లు వెల్లడించింది. గత ఏడాది ఇదేకాలంలో ఆర్‌బిఐ నికరంగా 16.301 బిలియన్‌ డాలర్లను కొనుగోలుచేసింది. ఈ ఏడాది సెప్టెంబరులో ఆర్‌బిఐ 31 మిలియన్‌ అమెరికా డాలర్లను స్పాట్‌ మార్కెట్‌లో విక్రయించి రూపాయి క్షీణతను కట్టడిచేసింది. ఈ నెలలో సెంట్రల్‌ బ్యాంకు 1.012 బిలియన్‌ డాలర్లు కొనుగోలుచేస్తే 1.043 బిలియన్‌ డాలర్లను స్పాట్‌ మార్కెట్‌లో విక్రయించింది. ఆగస్టు జులై నెలల్లో 2.323 బిలియన్‌ డాలర్లు, 1.87 బిలియన్‌ డాలర్లు విక్రయించింది. రిజర్వుబ్యాంకు ఏప్రిల్‌,మే,జూన్‌నెలల్లో నికరంగా 2.483 బిలియన్‌ డాలర్లు, 5.767 బిలియన్‌ డాలర్లు, 6.184 బిలియన్‌ డాలర్లు అమెరికాకరెన్సీని విక్రయించింది. గత ఏడాదిసెప్టెంబరునెలలో ఆర్‌బిఐ 1.259 బిలియన్‌ డాలర్లను కొనుగోలుచేసింది. ఆ తర్వాత స్పాట్‌ మార్కెట్‌నుంచే 3.788 బిలియన్‌ డాలర్లు, 2.529 బిలియన్‌ డాలర్లను కొనుగోలుచేసింది. విదేశీ కరెన్సీ మార్కెట్‌లో రూపాయి క్షీణత, అనిశ్చితిని కట్టడిచేసేందుకు రిజర్వుబ్యాంకు జోక్యం అనివార్యం అయింది. రూపాయిని స్థిరమైన లక్ష్యంవరకూ తీసుకువచ్చేందుకు ఆర్‌బిఐ డాలర్లను విక్రయించింది. గడచిన కొన్ని నెలలుగా ఆర్‌బిఐ కరెన్సీ మార్కెట్‌లో కీలకపాత్రపోషించింది. డాలరుతో రూపాయి భారీ క్షీణతను క్రమేపీ కట్టడిచేసింది. దేశీ కరెన్సీ ఒకదశలో అక్టోబరునెలలోనే 74.1 రూపాయలకు పడిపోయింది. వెనువెంటనే సర్వోన్నత బ్యాంకు నికరంగా 33.689 బిలియన్‌ డాలర్లను స్పాట్‌ మార్కెట్‌నుంచి కొనుగోలుచేసింది. స్పాట్‌ మార్కెట్‌లో ఇప్పటివరకూ 52.068 బిలియన్‌ డాలర్లు కొనుగోలుచేస్తే 18.379 బిలియన్‌ డాలర్లను విక్రయించింది. ఆర్బఇఐ 12.351 బిలియన్‌ అమెరికా డాలర్లను నికరంగా గత ఏడాది కొనుగోలుచేసింది. ఇక డాలర్ల ఫార్వార్డ్‌ మార్కెట్‌పరంగా సెప్టెంబరు చివరినాటికి డాలర్ల విక్రయం 1.358 బిలియన్‌ డాలర్లుగా ఉన్నాయి. అంతకుముందు ఆగస్టునెలలో 5.730 బిలియన్‌ డాలర్లని ఆర్‌బిఐ గణాంకాలు విడుదలచేసింది.