ఆధార్‌ లింకింగ్‌పై ‘సుప్రీం’వాయిదా

AADHAR1
AADHAR1

ఆధార్‌ లింకింగ్‌పై ‘సుప్రీం’వాయిదా

న్యూఢిల్లీ, మార్చి 14: ప్రత్యేక ఐడెంటిఫికేషన్‌ నంబర్‌ ఆధార్‌ అనుసంధానంపై సామాన్యులకు భారీ ఊరట లభించింది. ఈ మార్చి31తో ముగియ నున్న వివిధ ప్రభుత్వ సంక్షేమ పథకాలు,బ్యాంకు ఖాతాలు, మోబైల్‌ సేవలు తదితరాలకు ఆధార్‌ అనుసంధానం గడువును దేశ అత్యున్నత న్యాయ స్థానం సుప్రీంకోర్టు వాయిదా వేసింది.

చీఫ్‌ జస్టిస్‌ దీపిక్‌ మిశ్రా నేతృత్వంలోని జస్టిస్‌ ఎకెసిక్రీ, ఎఎం ఖాన్విల్కర్‌, డివై చంద్రకుడ్‌, అశోక్‌ భూషణ్‌తో కూడిన ఐదుగురు న్యాయనిర్ణేతల రాజ్యాంగ ధర్మా సనం దీనిపై విచారణ పూర్తయ్యేంతవరకు ఎలాం టి డెడ్‌లైన్‌ లేదని తేల్చి చెప్పింది. అసలు బ్యాంకు ఖాతాలు, మొబైల్‌ లాంటి సేవలను ఆధార్‌ లిం కింగ్‌ తప్పనిసరి కాదని చెప్పింది.

ఆధార్‌ మారడే టరీ, ఆధార్‌ గోప్యతపై పలు పిటీషన్లపై విచారిం చిన సుప్రీం మంగళవారం ఈ కీలక ఆదేశాలు జారీ చేసింది. అంతేకాకుండా బ్యాంకు ఖాతా, మొబైల్‌, తత్కాల్‌ పాస్‌పోర్ట్‌లాంటి సేవలకు ప్రత్యేక ఐడెంటి ఫికేషన్‌ నంబర్‌ ఆధార్‌ తప్పనిసరికాదని స్పష్టం చేసింది. ప్రభుత్వ, సాంఘిక పథకాలకు మాత్రమే ఆధార్‌ అవసరమవుతుందని పేర్కొంది. కాగా ప్రభుత్వ సేవలు పొందటానికి ఆధార్‌ కచ్చితమా లేదా అనే అంశంపై పలు స్వచ్ఛంద సంస్థలు పిటి షన్లపై సుప్రీంకోర్టులో వాదనలు కొనసాగుతున్నా యి. ఈనేపథ్యంలో ఆధార్‌ అనుసంధానం గడువు ను పలుమార్లు పొడిగించిన సంగతి తెలిసిందే.