ఆధార్‌-పాన్‌ అనుసంధానం తప్పనిసరి

Tax
Tax

ఆధార్‌-పాన్‌ అనుసంధానం తప్పనిసరి

న్యూఢిల్లీ, మే 12: ఆదాయపు పన్నుశాఖ రిటర్నులు దాఖలు చేసేవారికోసం కొత్త ఇ-సౌకర్యాన్ని విడుదల చేసింది. ఆధార్‌కార్డును పాన్‌నంబరుతో అనుసంధా నం చేసే ఇసౌకర్యానికి తెరతీసింది. ఐటిరిటర్నులకు ఇకపై ఆధార్‌, పాన్‌నంబర్లు రెండూ కూడా తప్పనిసరి అవుతాయి. ఐటిశాఖ ఇఫైలింగ్‌ వెబ్‌సైట్‌లో కొత్త లింక్‌ ను హోంపేజ్‌పై ప్రారంభించింది. దీనివల్ల ఒక వ్యక్తి పూర్తి వివరాలను తెలుసుకునేందుకు మరింత సుల భం అవుతున్నది. ఈలింక్‌లో ఒకవ్యక్తి తన పాన్‌ నంబరు, ఆధార్‌నంబరులను ఆధార్‌కార్డులో చూపిం చిన పేరును విధిగా నమోదుచేయాల్సి ఉంటుంది. యుఐడిఎఐ పరిశీలన తర్వాత ఈ లింకింగ్‌ ధృవీకరి స్తుంది

. ఒకవేళ మిస్‌మాచ్‌ అయితే ఆధార్‌పేరు తప్పుగావస్తే ఆధార్‌ ఒటిపి అవసరంఅవుతుందని ఐట ిశాఖ వెల్లడించింది. ఈ ఒటిపిని రిజిస్టరు మొబైల్‌నంబర్లకు పంపిస్తుంది. జననతేదీ, పాన్‌, ఆధార్‌ కార్డు ల్లో వేసినవి సరిపోల్చుకుంటుంది. లాగిన్‌ అవసరంలేకుండానే లింక్‌ను క్లిక్‌చేస్తే చాలు మొత్తం వివరాలు నమోదుచేసుకునే అవసరం ఉంటుందని ఐటిశాఖ వెల్లడించింది. ఆర్ధికచట్టం 2017 ప్రకారం ప్రతి ఐటి రిటర్నుల దాఖలుతో పాన్‌, ఆధార్‌ను నిర్బంధంచేసింది. ఆధార్‌ కూడా పాన్‌నంబరుకు దరఖాస్తు చేయాలంటే విధిగా ఉండాలి. జూలై ఒకటవ తేదీనుంచి ఈ కొత్త నిబంధనలు అమలులోనికి వస్తు న్నాయి. ఇప్పటివరకూ 1.18 కోట్ల వరకూ ఉన్నాయి. పాన్‌ కార్డు అయితే పది సంఖ్యలున్న ఆల్ఫాన్యూ మరిక్‌ అక్షరాలు, గణకాల్లో కూడా ఉంటుంది. ఐటి శాఖ లామినేట్‌ చేసిన కార్డును జారీచేస్తుంది.