ఆడి కార్లపై భారీ తగ్గింపు

audi cars
audi cars

ఆడి కార్లపై భారీ తగ్గింపు

న్యూఢిల్లీ, డిసెంబరు 3: జర్మన్‌ లగ్జరీ కార్ల తయారీ సంస్థ ఆడిభారీ ఆఫర్‌ ప్రకటించింది. రానున్న క్రిస్మస్‌, న్యూఇయర్‌ సందర్భంగా లగ్జరీ కార్‌లవర్స్‌ కోసం తీపి కబురు అందించింది.

ఎంపిక చేసిన మోడళ్లపై దాదాపు మూడు నుంచి రూ.8.85లక్షల వరకు ధరలు తగ్గించినట్లు ఆడి ప్రకటించింది. లిమిటెడ ఆఫర్‌గా ప్రకటించిన ఈ ప్రత్యేక ధరలతోపాటు సులభమైన ఇఎంఐ ఆప్షన్స్‌ను కూడా అందిస్తోంది.

దీంతో పాటు మరో బంపర్‌ ఆఫర్‌ కూడా ఉంది. 2017లో పేవరేట్‌ ఆడి కారును కొనుగోలు చేసిన కస్టమర్లు, 2019లో చెల్లింపులు మొదలుపెట్ట వచ్చని ఇది తమ కస్టమర్లకు అంది స్తున్న అదనపు ప్రయోజనమని కంపెనీ వెల్లడించింది.

అమ్మకాల డ్రైవ్లో భాగం గా ఎంపిక చేసుకున్న మోడళ్లపై ఈ తగ్గింపును అందిస్తున్నట్లు ఆడి శుక్ర వారం వెల్లడించింది. క్రిస్మస్‌, కొత్త ఏడాది సందర్భంగా ఈ నిర్ణయం తీసు కున్నట్లు తెలిపింది.

ఆడిఏ3, ఆడిఏ4, ఆడి06, ఆడిక్యూ3 మోడళ్లపై ఈ ప్రత్యేక ధరలు, సులభ ఈఎంఐని అందిస్తున్నట్లు ఆడి ఇండియా ఒక ప్రకటనలో తెలిపింది. ఆఫర్‌లో భాగంగా ఆడి ఏ3 ఇప్పుడు రూ.26,99లక్షలకే లభ్యంకానుంది. దీని పాతధర రూ.31.99లక్షలు.

ఇక ఆడిఏ4 పాతధరరూ.39.97లక్షలు కాగా, ప్రస్తుతం రూ.33.99 లక్షలకే అందుబాటులో ఉండనుంది. అలాగే ఆడి ఏ6 సెడాన్‌ ధర రూ.53.84లక్షల నుంచి రూ.44.99లక్షలకు, ఎస్‌యూవీ ఆడి క్యూ3 ధర రూ.33.4లక్షల నుంచి రూ.29.99లక్షలకు తగ్గింది.