ఆటో రంగంలోనూ ఉద్యోగాలు కట్‌

auto
auto

ఆటో రంగంలోనూ ఉద్యోగాలు కట్‌

మిచిగావ్‌, మే 17: టెక్‌ దిగ్గజంలోని ఉద్యోగాల కోత ఇప్పుడు ఆటో కంపెనీలకు పాకినట్టుంది. ఫోర్డ్‌ మోటార్స్‌ కంపెనీ కూడా తమ స్టాఫ్‌కు కోత పెట్టాలని ప్లాన్‌ చేస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తమ ఉద్యోగుల్లో 10శాతం తగ్గించు కోవాలని ఫోర్డ్‌మోటార్స్‌ భావిస్తున్నట్టు వాల్‌స్ట్రీట్‌ జర్నల రిపోర్టు చేసింది. లాభాలను పెంచడానికి తీవ్రమైన ఒత్తిడి కారణంగా ఫోర్డు ఈ మేరకు నిర్ణయం తీసుకోబోతున్నట్టు తెలుస్తోంది.

చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌ మార్క్‌ ఫీల్డ్స్‌, స్టాక్‌ ధర వెనుక బాటును, లాభాల పెంపుకోసం తీవ్రంగా ఒత్తిడిని ఎదుర్కొంటు న్నట్టు ఈ రిపోర్టుపేర్కొంది. ఈ వారంలోనే ఫోర్డ్‌ కంపెనీలో ఉద్యో గాల కోత ఉంటుందని వాల్‌స్ట్రీల్‌ తెలిపింది.
ముఖ్యంగా టార్గెట్‌ శాలరీ ఉద్యోగులను ఇంటికి పంపించేస్తారని న్యూస్‌ పేపర్‌ పేర్కొంది. అయితే గంట లెక్కన పనిచేసే ఫ్యాక్టరీ వర్కర్లపై ఏ మేరకు ప్రభావం ఉంటుందో ఇంకా స్పష్టంకాలేదని ఈ జర్నల్‌ వెల్లడించింది. అలాన్‌ ములల్లిని రీప్లేస్‌ చేస్తూ ఫోర్డ్‌ సిఇఒగా మార్క్‌ను నియమించిన దగ్గర్నుంచి కంపెనీ షేర్లు 36శాతం పడి పోయాయి. ఆయన అవలంభిస్తున్న వ్యూహాలపై కంపెనీ బోర్డుసభ్యులు కూడా తీవ్రంగా ప్రశ్నలు సందిస్తున్నాయి. మార్క్‌ ఎక్కువగా వందల కోట్ల కొద్దీ మొత్తాన్ని ఎలక్ట్రిక్‌ ఆటోలు, సెల్ఫ్‌ డ్రైవింగ్‌ కార్లు, రైడ్‌ షేరింగ్‌ ఎక్స్‌ పర్మెంట్లపైనే వెచ్చిస్తున్నారు.

దీంతో కంపెనీ సంప్ర దాయ వ్యాపారం నష్టాల్లో కొనసాగుతుందని బోర్డు సభ్యులు మండిపడుతున్నట్టు తెలుస్తోంది. అసలుకే నెమ్మదించిన అమెరికా మార్కెట్లో తన ప్రత్యర్థి జనరల్‌ మోటార్స్‌ కంపెనీ తో పోటీపడటం కంపెనీకి క్లిష్టతరంగా మారింది. ఫోర్డ్‌ తన మార్చి క్వార్టర్‌ ఫలితాల్లోనూ 42శాతం పడిపోగా, జనరల్‌మోటార్స్‌ లాభాల ను నమోదుచేసింది. ఈప్రభావం ఉద్యోగులపై వేటుకు దారితీస్తుందని మార్కెట్‌ వర్గాలుంటున్నాయి. ఫోర్డ్‌ కంపెనీలో 2,01,000 మంది ఉద్యోగు లుండగా, వారిలో 1.01,000 మంది నార్త్‌ అమెరికాలోనే ఉన్నారు.