ఆక్టిలియాన్‌ కొనుగోలుచేసిన జాన్సన్‌అండ్‌జాన్సన్‌

Johnson
Johnson

ఆక్టిలియాన్‌ కొనుగోలుచేసిన జాన్సన్‌అండ్‌జాన్సన్‌

న్యూఢిల్లీ, జనవరి 26: అమెరికా ఫార్మాదిగ్గజం జాన్సన్‌ అండ్‌ జాన్సన్‌ కొత్తగా ఆక్టిలియాన్‌ ఫార్మాగ్రూప్‌ను 30 బిలియన్‌ డాలర్లకు కొనుగోలుచేస్తోంది. యూరోప్‌ లోని అతిపెద్ద బయోఫార్మాకంపెనీ స్విట్జర్లాండ్‌ కేం ద్రంగా ఉన్న ఆక్టిలియాన్‌ను కొనుగోలుచేస్తున్నట్లు ్కంపెనీ స్వయంగా ప్రకటిం చింది. ప్రపంచంలోనే అతిపెద్ద ఫార్మాకంపెనీగా ఉన్న జాన్సన్‌ అండ్‌ జాన్సన్‌ స్విస్‌ కంపెనీని కొనుగోలుచేయడం వెనుక ఫార్మారంగంలో ప్రపంచ వ్యాప్తంగా లీడర్‌గా ఎదగాలన్నదే ఆకాంక్షగా తెలుస్తోంది. కంపెనీ ఆక్టిలియాన్‌పరంగా బిపికి సంబంధించిన మందులను ఉత్పత్తిచేస్తోంది. అంతేకాకుండా స్విస్‌లో జాబితా అయినీ సంస్థ ఆర్‌అండ్‌డి న్యూకో గా అవతారం ఎత్తుతుంది. కొత్తగా మందులు, వివిధకొత్తరకాలను తయారీకోసం పరిశోధనలు నిర్వహిస్తుందని కంపెనీలు ఒక సంయుక్తప్రకటనలో వెల్లడించాయి. జాన్సన్‌ కంపెనీ ఆక్టిలి యాన్‌లోని షేర్లను ఒక్కొక్కటి 280 డాలర్లు చొప్పున కొనుగోలుకు రెండు కంపెనీల బోర్డులు అంగీకరించాయి. ఫిబ్రవరి మధ్యస్తం నుంచి టెండర్‌ ఆఫర్‌ద్వారా ఈ షేర్ల కొనుగోలు జరుగుతుంది ఆక్టిలియాన్‌ సిఇఒ జీన్‌పాల్‌ క్లోజెల్‌ కొత్త ఆర్‌అండ్‌డి కంపెనీ సరికొత్త ఒరవడికి నాందిపలుకుతుందని అన్నారు. జాన్సన్‌ షిఇఒ ఛైర్మన్‌ అలెక్స్‌ గోర్‌స్కీ మాట్లాడుతూ ఆక్టిలియాన్‌ కొనుగోలు రెండు కంపెనీల వాటాదారులకు మరింతమేలు జరుగుతుందన్నారు. ఆక్టిలియాన్‌ వ్యవ స్థాపకులు క్లోజెల్‌ కొత్త ఆర్‌అండ్‌డి కంపెనీని ఏర్పాటుచేస్తారు. ఇందులో 16శాతం వాటా అమెరికా కంపెనీకి ఉంటుంది. మరో 16శాతం వాటాలను కూడా అవసర మైతే కొనుగోలుకు ఆధారం ఉంది. మొత్తం 1.27లక్షల మంది ఉద్యోగులు జాన్సన్‌ లో పనిచేస్తున్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద వైద్య ఉత్పత్తుల కంపెనీగా జాన్సన్‌కు పేరుంది. చిన్నపిల్లల ఉత్పత్తులు, బ్యాండ్‌ ఎయిడ్స్‌కు జాన్సన్‌ పెట్టిందిపేరు.