అస్సాం బావుల్లో ఒఎన్‌జిసి రూ.6వేల కోట్ల పెట్టుబడి

ONGC
ONGC

న్యూఢిల్లీ: ప్రభుత్వరంగంలోని ఒఎన్‌జిసి అస్సాంలో తవ్వకాలు జరుపుతున్న బావుల్లో మరింత చమురు,గ్యాస్‌ వెలికితీతకోసం రూ.6వేల కోట్లుపెట్టుబడులు పెడుతున్నది. ఎగువ అస్సాంలోని శివసాగర్‌, ఛారేయిడియో జిల్లాల్లో అన్వేషణలకోసం సుమారు 300 మంది కొత్త ఉద్యోగులను నియమించుకుంటున్నది. వచ్చే ఏడేళ్లపాటు అస్సాంలో 200 బావుల్లో తవ్వకాలు జరిపేందుకు ఈ 6వేల కోట్లు వ్యయంచేస్తుంది. ఒఎన్‌జిసి డైరెక్టర్‌ఎస్‌కె మొయిత్రా వివరాలప్రకారంచూస్తే సుమారు 200కిపైగా సంస్థపరిధిలోని బావులను వివిధ క్షేత్రాల్లో ఉన్నవాటిని గుర్తించామని, శివసాగర్‌, ఛారైదియో జిల్లాల్లో ఉన్న ఈ బావుల్లో మరింతగా తవ్వకాలుజరపాలనినిర్ణయించినట్లు తెలిపారు. ప్రస్తుత ఆర్ధికసంవత్సరంనుంచి వచ్చే ఏడేళ్లపాటు తవ్వకాలు జరుపుతామని వెల్లడించారు. 2022 నాటికి ప్రస్తుతం ఉన్న ఉత్పత్తిలో పదిశాతాన్ని పెంచుతామని, అలాగే ఆఏడాదినాటికి దిగుమతులను కూడా 10శాతం తగ్గించేలక్ష్యంతో దేశీయ ఉత్పత్తిని పెంచుతున్నట్లు వెల్లడించారు. ఈశాన్యహైడ్రోకార్బన్‌లక్ష్‌యం 2030 కింద ఈ తవ్వకాలు జరుపుతున్నట్లు వెల్లడించారు. 2019సంవత్సంలో అస్సాం బావులపై ప్రత్యేక దృష్టిపెట్టామని కొత్త సంవత్సరకానుకగా 308కొత్త ఉద్యోగులను తీసుకుంటున్నట్లు మోయిత్రావెల్లడించారు.