అమెరికా సెక్యూరిటీల్లో భారత్‌ పెట్టుబడుల పెంపు

DOLLAR
DOLLAR

అమెరికా సెక్యూరిటీల్లో భారత్‌ పెట్టుబడుల పెంపు

న్యూఢిల్లీ,జూన్‌ 27: అమెరికా ప్రభుత్వ సెక్యూరిటీల్లో భారత్‌ పెట్టుబడుల వాటా 124.1 బిలియన్‌ డాలర్ల కు పెరిగాయి. 2016 జూలైనెల తర్వాత ఇదే గరిష్ట స్థాయిలో ఉన్నట్లు ప్రభుత్వం అంచనావేసింది. గత ఏడాది జూలైనెలలో 1213.7బిలియన్‌ డాలర్ల పెట్టు బడులు పెట్టింది. ఏప్రిల్‌ నెలాఖరునాటికి జపాన్‌ అమెరికాలో 1.106 లక్షలకోట్ల డాలర్ల పెట్టుబడులు ఉన్నట్లు అంచనా. ఆ తర్వాత చైనా 1.092 లక్షల కోట్ల డాలర్ల పెట్టుబడులుపెట్టింది. అమెరికా ట్రెజరీ డిపార్టుమెంట్‌ గణాంకాలను పరిశీలిస్తే భారత్‌ పెట్టుబడులు ఏడు బిలియన్‌ డాలర్లు పెరిగి 124.1 బిలియన్‌ డాలర్లకు చేరాయి. మార్చినెలలో భారత్‌ నుంచి అమెరికా సెక్యూరిటీల్లో పెట్టుబడులు 117.1 బిలియన్‌ డాలర్లుగా ఉన్నట్లు అంచనా. బ్రిక్స్‌ ఐదు దేశాల్లో అమెరికా సెక్యూరిటీల పెట్టుబడుల్లో భారత్‌ మూడో అతిపెద్ద దేశంగానిలిచింది.

చైనాబ్రెజిల్‌ దేశాలు రెండూ 267.7బిలియన్‌ డాలర్లు ఏప్రిల్‌నెలలో పెట్టు బడులు పెట్టాయి. రష్యాకు సెక్యూరిటీలపరంగా 104.9 బిలియన్‌ డాలర్లు పెరిగినట్లు అంచనా. ట్రెజరీ డిపార్టుమెంట్‌ విదేవీ నివాసితులు తమతమ ట్రెజరీ బిల్స్‌ను ఏప్రిల్‌నెలలో 7.2బిలియన్‌ డాలర్లకు పెంచా యి. డాలర్‌ఆధారిత స్వల్పకాలిక అమెరికా సెక్యూ రిటీలు ఇతర ఉత్పత్తుల్లో 26 బిలియన్‌ డాలర్లుగా విదేశీ నివాసితుల వాటా ఉన్నట్లు అంచనా. 2017 మొదటి త్రైమాసికంలో అమెరికా వాస్తవస్థూల దేశీయో త్పత్తి వార్షిక పద్ధతిన 1.2 శాతంగా ఉంది. గతనెలలో బ్యూరో ఆఫ్‌ ఎకనమిక్‌ అనాలిసిస్‌ విడుదల చేసిన నివేదికలే ఈ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి.