అబూదాబి చమురుకంపెనీలో ఒఎన్‌జిసికి 10శాతం వాటా!

ONGC
ONGC

దుబాయి: ప్రభుత్వరంగంలోని చమురుసహజవాయుసంస్థ ఒఎన్‌జిసి అబూదాబి నేషనల్‌ ఆయిల్‌కంపెనీ (ఆడ్‌నాక్‌)లో వాటా కొనుగోలుకు సంసిద్ధత వ్యక్తంచేసింది. ఈసంస్థలో వాటా కొనుగోలుకు వస్తున్నమొట్టమొదటి భారత సంస్థగా ఒఎన్‌జిసి నిలిచింది. ఒఎన్‌జిసి ఈ సంస్థనుంచి పదిశాతం వాటా కొనుగోలుచేస్తుందని ఈ వీల్‌ విలువ 600 మిలియన్‌ డాలర్లవరకూ ఉండవచ్చని నిపుణుల అంచనా. కొద్దిరోజుల్లోనే అధికారిక ప్రకటన వెలువడుతుందని అంచనా. ప్రభుత్వరంగంలోని ఆడ్‌నాక్‌ ఆగస్టునెలలో తమ సముద్రగర్భంలోని తవ్వకాలు, అన్వేషణ ప్రాజెక్టులను రెండుగా విభజించనున్నట్లు వెల్లడించింది. అడ్మా, ఆప్‌కో సంస్థలు మరికొన్ని ప్రాంతాలకు విస్తరిస్తోంది. ఇందుకోసం అవసరమైతే విదేశీ బాగస్వామ్యాలను సైతం తీసుకుంటుంది. ఇప్పటికే ఒఎన్‌జిసి భారత్‌లో అతిపెద్ద రిఫైనరీ సంస్థహెచ్‌పిసిఎల్‌ను కొనుగోలుచేసింది. ఒన్‌జిసికి అనుబంధంగా ఉన్నఒఎన్‌జిసి విదేశ్‌ పలు దేశాల్లోని చమురు సంస్థల్లో పెట్టుబడులుసైతం పెడుతోంది. కొన్ని దేశాల్లో తాను సొంతంగా చమురుగ్యాస్‌ అన్వేషణ ప్రాజెక్టులు చేజిక్కించుకుని కొనసాగిస్తోంది. అదేవిధంగా ఇతరప్రభుత్వరంగ సంస్థల్లో సైతం పెట్టుబడులను పెంచాలనియోచిస్తోంది. ఇందులోభాగంగానే చమురు,సహజవాయునిల్వలు అధికంగా లభించే గల్ఫ్‌దేశాలపై ఎక్కువ దృష్టిసారించిన ఒఎన్‌జిసి తొలివిడతగా అబూదాబి అతిపెద్ద ప్రభుత్వరంగ చమురుకంపెనీ వాటాల కొనుగోలుకు ముందుకువచ్చింది.