అపోలో రాబడులు రూ.1684 కోట్లు

APOLLO
APOLLO

అపోలో రాబడులు రూ.1684 కోట్లు

హైదరాబాద్‌, ఆగస్టు 15: అపోలోఏకీకృత రాబడులు 15శాతంపెరిగి రూ.1684 కోట్ల రూపాయలుగా నిలిచాయి. అపోలో ఆసుప్రతుల గ్రూప్‌ తన తొలిత్రైమా సిక ఫలితాలను సోమవారం ప్రకటించింది. నిర్వహణ లాభాలు రూ.174 కోట్లుగా ఉంటే నికరలాభం రూ.35 కోట్లుఆర్జించినట్లు వెల్లడించింది. ఆరోగ్య సేవల రాబడులు 10శాతం పెరిగితే, శాప్‌ రాబడులు 21శాతం పెరిగినట్లు వివరించింది. ఇక మేచర్‌ హెల్త్‌కేర్‌ మార్జిన్లు 20.1శాతంగా పెరిగాయని కంపె నీ వివరించింది. శాప్‌ నిర్వహణ లాభాలు 46శాతం కంటేమెరుగుపడినట్లు వివరించింది. వడ్డీరేట్ల రాబడు లు 15శాతం, మార్జిన్లు 4.2శాతంగా ఉన్నాయని అంచనా.

ఇక కొత్తగా తొలిత్రైమాసికంలో 87 స్టోర్లను ప్రారంభించామని, దేశవ్యాప్తంగా మొత్తం 2643 స్టోర్లకు పెంచినట్లుఅపోలో వెల్లడించింది. గత ఏడాది రాబడులు 1465 కోట్లతోపోలిస్తే భారీగా వృద్ధిని సాధించామని వివరించింది.గడచిన మూడు,నాలుగు త్రైమాసికాల్లో పెద్దనోట్ల రద్దు ప్రభావంతో కొంతమేర మాంద్యం ఉన్నప్పటికీ క్రమేపీ పెరిగినట్లు వెల్లడిం చారు. చెన్నైమెయిన్‌, హైదరాబాద్‌,మైసూర్‌, భువనే శ్వర్‌లలో మరింతగారాబడులు వచ్చినట్లు తెలిపారు. అదనంగా నవీముంబై, వైజాగ్‌ కొత్త యూనిట్లు ప్రారంభించి వెంటనే మంచి వృద్ధిలోకి వచ్చినట్లు అపోలోయాజమాన్యం వెల్లడించింది. మొత్తంగ్రూప్‌లో 4278 పడకల సంఖ్య ఉందని, 62శాతంగా భర్తీ అయినట్లు వెల్లడించింది.

మేచర్‌ ఆసుపత్రుల్లో బెడ్స్‌ భర్తీ 63శాతంగా ఉందని, కొత్త ఆసుపత్రుల్లో కూడా 55శాతంగా ఆక్యు పెన్సీ ఉందని అపోలో వివరించింది. ఆరోగ్యరంగంలో మౌలికవనరులు సమ కూర్చడం ద్వారా తమగ్రూప్‌ ఏకీకృత సేవల్లో దేశవ్యాప్తంగా మంచి గుర్తింపు పొందిందని, అందుకు త్రైమాసిక పలితాలే కీలకమని ఛైర్మన్‌ డా.ప్రతాప్‌ సిరెడ్డి వెల్లడించారు. గడచిన మూడేళ్లలోనే 2400 కొత్త పడకలు ఏర్పాటుచేసామని, దేశంలోనే అత్యధికంగా ప్రత్యేక వసతులు ఆంకాలజీ, న్యూరోసైన్సెస్‌, ఆర్థోపెడిక్స్‌, అవయవాలమార్పిడిలో మంచి వృద్ధి ని నైపుణ్యాలను చూపిస్తున్నట్లు వివరించారు. వచ్చే రెండేళ్లకు ఇదే ప్రగతి కొనసాగిస్తామని ఆయ న ధీమా వ్యక్తంచేశారు.

తొలిత్రైమాసికంలో సహ జంగానే తరుగుదల, వడ్డీ ఖర్చులు, కొత్త బెడ్‌ల ఏర్పాటు వల్ల కొంతమేర నికరలాభాలు తగ్గాయని రానున్నరోజుల్లో భర్తీ అవుతుందని అన్నారు. ప్రతి వాటాకు రాబడులు 2.53రూపాయలుగా ఉన్నా యి. ఫార్మసీరంగంలో కొత్తగా 88 స్టోర్లు ఏర్పాటు చేసామని, మొత్తం దేశంలోనే ఫార్మసీ నెట్‌వర్క్‌ 2643గా నిలిచాయన్నారు. రాబడులు 20.8 శాతం పెరిగి 764.2కోట్లకు చేరాయి. నిర్వహణలాభాలు 21.9 కోట్లుగా ఉంద న్నారు. ప్రతి స్టోర్‌కు రాబడి 8శాతంగా ఉంది. కంపెనీ గ్రూప్లఓని అపోలో మునిచ్‌ హెల్త్‌ఇన్సూరెన్స్‌పనితీరు కూడా మెరుగుపడింది. కొత్తగా ఈ త్రైమాసి కంలో నిర్వహణ ఆస్తులు 969.3 కోట్లుగా ఉందని కంపెనీ వివరించింది.