అపోలోతో ఆర్‌ఎంఎస్‌రీగ్రో టైఅప్‌

 Apollo
Apollo

అపోలోతో ఆర్‌ఎంఎస్‌రీగ్రో టైఅప్‌

హైదరాబాద్‌,జూన్‌ 20: ఎముకుల చికత్సలకోసం అపోలో గ్రూప్‌ యాజమాన్యం కొత్తగా ఆర్‌ఎంఎస్‌ రీగ్రో తో ఒప్పందంచేసుకుంది. సెల్‌థెరపీతో ఆర్థోపెడిక్‌ రోగులకు చికిత్స అందించేందుకు వీలు కలిగిస్తుందని అపోలో చెపుతోంది. ప్రత్యేకించి ఎముకల సమస్యలపై ఎక్కువ పనిచేస్తుంది. ఓస్రాన్‌ బోన్‌ కార్డిలేజ్‌ సమస్యలపై ఓస్రాన్‌, చాండ్రాన్‌ ఉత్పత్తులను వినియోగించి ఎముకల సమస్యలను నివారించవచ్చని చెపుతోంది. ఆర్థోపేడిక్‌ డాక్టర్లకు పునరుత్పత్తి వైద్యవిధానంద్వారా సర్జికల్‌ వర్కుషాపులు, సిఎంఇలు వంటివి వైద్యులకు నిర్వహించి అవగాహన పెంపొందిస్తున్నది. అపోలో గ్రూప్‌ ఛైర్మన్‌ డా.ప్రతాప్‌ సిరెడ్డి మాట్లాడుతూ హెల్త్‌కేర్‌ రంగంలో చేపట్టిన సృజనాతఓమక పద్దతులద్వారా అనేకమంది రోగులకు చికిత్సలు చేరువ అవుతున్నాయని అపోలో గ్రూప్‌ ఈ చికిత్సల్లో అగ్రగామిగా నిలిచిందన్నారు.

ఆర్‌ఎంఎస్‌ రీగ్రోతో తమ అను బంధం చికిత్సల్లో మరింత అధు నాతన విధానాలను అనుసరిం చేందుకు దోహదం చేస్తుందన్నా రు. ఆర్‌ఎంఎస్‌ రీగ్రో సిఇఒ యాష్‌ సంఘ్వి మాట్లాడుతూ అపోలోతో భాగస్వామ్యం ఎంతో హర్షణీయమన్నారు. అపోలో లాంటి అత్యాధునిక వసతులు న్న ఆసుపత్రులతో టైఅప్‌ వల్ల ఎముకల సమస్యలకు సంబంధించి ఆర్‌ఎంఎస్‌ రీగ్రో అందించే ఉత్ప త్తులకు ఎంతో మార్కెట్‌ ఉంటుందన్న ధీమా వ్యక్తంచేసారు. ఇప్పటికే ఆర్‌ఎంఎస్‌ రీగ్రో దేశవ్యాప్త సేవల్లో ముందున్నదన్నారు. ఎనిమిదేళ్ల అంకితభావంతో చేసిన సేవలు విప్లవాత్మక ఉత్పత్తులను తీసుకువచ్చినట్లు యాష్‌ సంఘ్వి వివరించారు.భారత్‌లో ప్రతి ఏటా 15వేలకుపైగా వివిధ ఎముకల చికిత్స విధానాలు అమలువుతున్నాయని వీటిలో సెల్‌థెరపీ విధానం అత్యంత కీలకంగా మారింద న్నారు. అపోలో జెఎండి సంగీతారెడ్డి మాట్లాడుతూ వైద్యప్రమాణాలను మరింతగా మెరుగుపరిచేందు కు అపోలో ఎప్పటికప్పుడు అధునాతన విధానాలను ప్రవేశపెడుతుందని ప్రస్తుతం అపోలో ఆర్‌ఎంఎస్‌ రీగ్రోతో ఇదే ఒప్పందం చేసుకున్నదని పేర్కొన్నారు. దీనివల్ల ఎముకల సమస్యలున్న రోగుల కు ఎంతో అధునాతన వైద్యవిధానం అందుబాటులోకి తెచ్చినట్లవుతుందని ఆమె అభిప్రాయం వ్యక్తం చేసారు.