అంబీవ్యాలీలో మారిషస్‌ ఫండ్‌ పెట్టుబడి

SAHARA

అంబీవ్యాలీలో మారిషస్‌ ఫండ్‌ పెట్టుబడి

న్యూఢిల్లీ, ఆగస్టు 13 మారిషస్‌ కేంద్రంగా ఉన్న ఇన్వెస్టర్‌ రాయల్‌ పార్టనర్స్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ఫండ్‌ అంబీ వ్యాలీలో 1.67 బిలియన్‌ డాలర్లు అంటే రూ.10,700 కోట్లు పెట్టుబడులు పెట్టేందుకు ముందుకువచ్చింది. సుప్రీం కోర్టు అంబీవ్యాలీ రిసార్టును విక్రయించాలన్న ఆదేశాలతో ముంబై, పూణె మధ్యలో ఉన్న సహారా అంబీ వ్యాలీలో పెట్టుబడులకు మారిషస్‌ ఫండ్‌సంస్థ సంసిద్ధత వ్యక్తంచేసింది. సహారాగ్రూప్‌ మార్కెట్‌ విలువలు ప్రస్తుతం లక్షల కోట్లరూపాయల విలువలు అధిగ మిం చాయి. రాయల్‌ పార్టనర్స్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ఫండ్‌ మారిషస్‌లో రిజిష్టరు అయింది. గ్లోబల్‌ బిజినెస్‌ కంపెనీగా మంచి పేరుంది. దుబాయి కెేంద్రంగా ఆర్‌పిఎంజి ఇన్వెస్ట్‌మెంట్‌ నడుపు తోంది.

పెట్టుబడులు, ప్రైవేటు ఈక్విటీ, అసెట్‌ మేనేజ్‌మెంట్‌, ట్రేడింగ్‌ వ్యవహారాలు పర్యవేక్షి స్తుంది. అంబీవ్యాలీ ప్రాజెక్టులో 1.67 బిలియన్‌ డాలర్లు పెట్టుబడుపెట్టేందుకు రాయల్‌పార్టనర్స్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ఫండ్‌ సిద్ధమేనని ధృవీకరించింది. ఇతర డీల్‌వివరాలు గోప్యంగా ఉంచింది. అంబీ వ్యాలీఇండియా, మారిషస్‌సంస్థల ఒప్పందం, డీల్‌ నియమనిబంధనలు మాత్రం రహస్యంగా ఉన్నాయి. సుప్రీంకోర్టు పరిధిలో ఉన్నందున ఈ వ్యవహారంపై ఇంతకుమించి స్పందించలేమని వెల్లడించారు. సహారా న్యాయవాది గౌతమ్‌ అవస్థి మాట్లా డుతూ గ్రూప్‌ సుప్రీంకోర్టుముందు దరఖాస్తు చేస్తూ విక్టర్‌ కోయింగ్‌యుకె లిమిటెడ్‌ సంస్థ రాయల్‌ నామినీగా వ్యవహఱిస్తోంది. ఈ సంస్థతో ఒప్పందంచేసుకునేందుకు అంగీకరించా లని కోరినట్లు తెలిపారు. ఈ డీల్‌జరుగుతున్న కారణంగా ప్రస్తుతం అంబీవ్యాలీ వేలం నిలిపి వేయాలని లేదావాయిదా వేయాలని కోరింది

.సెబి ఎమికస్‌ క్యూరి, కపిల్‌సిబాల్‌ వంటి న్యాయ వాదులు వినిపించిన వాదనల అనంతరం సుప్రీం కోర్టు సహారాకు ఒక అవకాశం ఇస్తూ సంప్రదిం పులు జరిపేందుకు అనుమతించింది. అయితే 1500 కోట్లు మాత్రం వచ్చే వాయిదా నాటికి డిపాజిట్‌చేయాలని. మారిషస్‌ పెటు ్టబడులు కూడా డిపాజిట్‌చేయాలని సూచించింది. రూ.1500 కోట్లు డిపాజిట్‌ చేసామని, వేలం ఉత్తర్వులు ఉపసంహరిస్తారని న్యాయవాది అవస్థి వెల్లడించారు. సుప్రీంకోర్టు అంతకు ముందురోజే వేలం షెడ్యూలు కొనసాగించాలని, రూ.1500 కోట్లు చెల్లించినపక్షంలో సరైన ఉత్తర్వులు జారీచేస్తా మని సెప్టెంబరు ఏడవ తేదీలోపు సెబీసహారా రిఫండ్‌ ఖాతాకు జమచేయాలని సుప్రీం సూచిం చింది.

అయితే సహారాగ్రూప్‌ వేలం వాయిదా వేయాలని, ఈనెల 14వ తేదీ నోటిఫికేసన్‌ జారీచేసే అవకాశం ఉందని, సెప్టెంబరు 16వ తేదీవరకూ వాయిదా వేయాలని సుభ్రతారా§్‌ు నగదును ఏర్పాటుచేస్తారని సహారా పిటిషన్‌ దాఖలుచేసింది. న్యూయార్క్‌లోని హోటళ్లు విక్ర యించడం జరిగిందని, నగదు రాగానే సహారా ఖాతానుంచి రూ.1500 కోట్లు జమ అవుతా యని వెల్లడించారు. మూలధనమార్కెట్ల నియం త్రణ సంస్థ సెబీతో సహారా సుదీర్ఘ కాలంగా కోర్టువివాదం ఎదుర్కొంటున్నది. గడచిన జులై 25వ తేదీ సుప్రీంకోర్టు ఉత్తర్వులుజారీచేస్తూ సహారా ఛీఫ్‌ రూ.1500 కోట్లు సెబీ సహారా ఖాతాలో సెప్టెంబరు 7వ తేదీలోపు జమ చేయాలని ఆదేశించింది. నిర్దిష్టగడువులోపు జమచేయాలని కోరితే సహారా మాత్రం 18నెలల వ్యవధి కావాలని విజ్ఞప్తిచేసింది