కీలక వడ్డీ రేట్లు యథాతథం..ఆర్బీఐ

YouTube video
rbi-governor-shaktikanta-das-press-meet

ముంబయి: ఆర్బీఐ గ‌వ‌ర్న‌ర్ శ‌క్తికాంత్ దాస్ ఈరోజు మీడియాతో మాట్లాడుతూ.. కీలక వడ్డీ రేట్లను ఈసారి యథాతథంగానే ఉంచుతున్నట్టు ప్రకటించారు. రెపో రేటు 4 శాతం, రివ‌ర్స్ రెపో రేటును 3.3 శాతంగానే య‌ధాత‌థంగా ఉంచుతున్నట్టు ఆయన పేర్కొన్నారు. బ్యాంకులకు ఇచ్చే రుణాల నుంచి ఆర్బీఐ వసూలు చేసే వడ్డీరేటును రెపోరేటు అనీ.. బ్యాంకులకు ఆర్బీఐ చెల్లించే వడ్డీ రేటును రివర్స్ రెపోరేటు అని అంటారు. రెపోరేటు తగ్గితే.. తద్వారా వచ్చే లబ్ధిని తమ వినియోగదారులకు బదలాయించవచ్చునని బ్యాంకులు ఆశిస్తాయి. తద్వారా గృహ, వాహన రుణాలు సహా ఇతర రుణాలపై వడ్డీ భారం తగ్గి ఈఎంఐల భారం తగ్గుతుంది. ఈ సారి వడ్డీరేట్లను ఆర్బీఐ కనీసం 25 బేస్ పాయింట్లు తగ్గిస్తుందని వ్యాపార వర్గాలు ఆశించాయి.

రెపో రేటు అంటే…

ఆర్‌బీ వద్ద బ్యాంకులు రుణాలు తీసుకుంటాయి. ఈ అప్పులు ఇచ్చినందుకు ఆర్‌బీఐ వడ్డీ వసూలు చేస్తుంది. ఈ వడ్డీ రేటునే రెపో రేటు అంటారు. రెపోరేటు తక్కువ ఉంటే బ్యాంకులు తక్కువ వడ్డీకి అప్పులిస్తాయి.

రివర్స్‌ రెపోరేటు అంటే..

కొన్ని బ్యాంకులు తమ ఉన్న అదనపు డబ్బును అర్‌బీఐ వద్ద డిపాజిట్‌ చేస్తాయి. దీనికి ఆర్‌బీఐ వడ్డీ చెల్లిస్తుంది. ఆర్‌బీఐ చెల్లించే వడ్డీ రేటునే రివర్స్‌ రెపోరేటు అంటారు. ఇది రెపో రేటుకన్నా తక్కువగానే ఉంటుంది. మర్కెట్లో పరిస్థితులు బాగాలేనపుడు స్థిర వడ్డీ వస్తుందనే ఉద్దేశంతో బ్యాంకులు తమ అదనపు నగదు నిల్వలను ఆర్‌బీఐ వద్ద ఉంచుతాయి.


తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/