బాలాసాహెబ్‌ విఖే పాటిల్‌ ఆత్మకథను విడుదల

YouTube video
PM Shri Narendra Modi releases autobiography of Balasaheb Vikhe Patil

న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్రమోడి మాజీ కేంద్ర మంత్రి బాలాసాహెబ్ విఖే పాటిల్ ఆత్మకథను విడుదల చేశారు. ఈ సందర్భంగా ప్రధాని వ‌ర్చువ‌ల్ స‌మావేశంలో మాట్లాడుతూ..త‌మ ప్ర‌భుత్వం ప్ర‌వేశ‌పెట్టిన చ‌రిత్రాత్మ‌క వ్య‌వ‌సాయ సంస్క‌ర‌ణ‌ల‌తో రైతులు ఔత్సాహిక వ్యాపార‌వేత్త‌లుగా మారుతార‌ని అన్నారు. రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేసేందుకు కూడా త‌మ ప్ర‌భుత్వం క‌ట్టుబ‌డి ఉంద‌న్నారు. ఇటీవ‌ల పార్ల‌మెంట్‌లో ఆమోదం పొందిన వ్య‌వ‌సాయ చ‌ట్టాల‌ను చ‌రిత్రాత్మ‌కంగా కీర్తించిన మోడి.. అన్న‌దాత‌ల‌ను ఔత్సాహిక పారిశ్రామిక‌వేత్త‌లుగా మారుస్తున్న‌ట్లు తెలిపారు. గుజ‌రాత్‌, మ‌హారాష్ట్ర‌, హ‌ర్యానా, పంజాబ్ రాష్ట్రాల్లో అత్య‌ధిక స్థాయిలో పాలు, చెరుకు, గోధుమ ఉత్ప‌త్తి జ‌రుగుతున్న‌ద‌ని, అలాంటి స్థానిక వ్యాపారం దేశాన్ని ముందుకు తీసుకువెళ్తుంద‌న్నారు. కాగా దేశంలో ఇంకా క‌రోనా వైర‌స్ ముప్పు ఉన్న‌ట్లు కూడా ప్ర‌ధాని వెల్ల‌డించారు. సోష‌ల్ డిస్టాన్సింగ్‌, వ్య‌క్తిగ‌త ప‌రిశుభ్ర‌త పాటించాల‌న్నారు.


తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/