పిఎం ఆవాస్‌ యోజన ఇళ్లను ప్రారంభించిన ప్రధాని

YouTube video
PM Modi inaugurates 1.75 lakh houses built under PM Awaas Yojana – Gramin in Madhya Pradesh

న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్రమోడి ఈరోజు మధ్యప్రదేశ్‌లో ఆవాస్‌ యోజన (గ్రామీణ్‌) కింద నిర్మించిన 1.75లక్షల గృహాల ప్రవేశ కార్యక్రమాన్ని వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ప్రారంభించారు. కార్యక్రమానికి మధ్యప్రదేశ్‌ ముఖ్యమంత్రి శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రధాని పలువురు లబ్ధిదారులతో మాట్లాడారు. 2లక్షల కుటుంబాలకు అభినందనలు, ఈ సారి మీ అందరికీ దీపావళి పండుగ శుభాకాంక్షలు అన్నారు. గతంలో ప్రభుత్వం వెంట పేదలు పరుగెత్తే వారని, ప్రస్తుతం ప్రభుత్వం పేదల వద్దకు వెళ్తోందని మోడి అన్నారు.

ఈ సారి మీ అందరికీ దీపావళి పండుగ శుభాకాంక్షలు అన్నారు. కరోనా మహమ్మారి లేకపోతే మీ ప్రధాన సేవకుడు ఈ రోజు మీ జీవితంలోని గొప్ప ఆనంద క్షణాల్లో మీ మధ్య ఉండేవాడన్నారు. గతంలో పేదలు ప్రభుత్వం వెనుక పరుగులు పెట్టారని, ఇప్పుడు ప్రభుత్వం పేదల వద్దకు వెళ్తోందన్నారు. ఎవరి ఇష్టానికి అనుగుణంగా జాబితాలో పేరు జోడించడం, తీసివేయడం చేయలేమని, ఎంపిక నుంచి నిర్మాణం వరకు శాస్త్రీయ, పారదర్శక విధానాన్ని అవలంభిస్తు్న్నామని పేర్కొన్నారు.


తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/