మారిషస్ సుప్రీంకోర్టు భవనాన్ని ప్రారంభించిన ప్రధాని

YouTube video
PM Modi and PM Jugnauth jointly inaugurate new Supreme Court building of Mauritius via VC

న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్రమోడి మారిషస్ కొత్త సుప్రీంకోర్టు భవనాన్ని మారిషస్ ప్రధాని ప్రవీంద్ జుగ్నాత్ సంయుక్తంగా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా గురువారం ప్రారంభించారు. ఇరు దేశాల స్వతంత్ర న్యాయవ్యవస్థలు మన ప్రజాస్వామ్య వ్యవస్థలకు ముఖ్యమైన స్తంభాల‌ని మోదీ ఈ సంద‌ర్భంగా అన్నారు. ఆధునిక డిజైన్, నిర్మాణంతో ఆకట్టుకునే ఈ కొత్త భవనం ఈ గౌరవానికి గుర్తు అని తెలిపారు. భార‌త్‌, మారిష‌స్ మ‌ధ్య అభివృద్ధి, సహకారం ఎటువంటి షరతులతో కూడిన‌ది కాద‌న్నారు. హిందూ మహా సముద్రం ప్రాంతాల అభివృద్ధి విధాన‌మైన ఖసాగర్ సెక్యూరిటీ అండ్ గ్రోత్ ఫర్ రీజియన్గ గురించి తొలుత మారిష‌స్‌తోనే మాట్లాడిన‌ట్లు గుర్తు చేశారు. క‌రోనాను సమర్థవంతంగా నియంత్రిస్తున్న మారిషస్ ప్రభుత్వం, ఆ దేశ ప్ర‌జ‌ల‌ను అభినందిస్తున్న‌ట్లు మోదీ తెలిపారు. మ‌రోవైపు త‌మ దేశ సుప్రీంకోర్టు కొత్త భ‌వ‌నం నిర్మాణానికి స‌హ‌క‌రించిన భార‌త్‌కు మారిష‌స్ ప్ర‌ధాని ప్ర‌వీంద్ జుగ్నాత్ ధ‌న్య‌వాదాలు తెలిపారు.


తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/business/