హైటెక్‌ సిటి-రాయదుర్గం మెట్రోలైన్‌ ప్రారంభించిన కెటిఆర్‌

హైదరాబాద్‌: హైటెక్‌ సిటీ నుంచి రాయదుర్గం వరకు మెట్రో సేవలను శుక్రవారం మంత్రి కేటీఆర్‌ ప్రారంభించారు. ఈ రోజు ఉదయం 10.15 గంటలకు హైటెక్‌ సిటీ మెట్రో స్టేషన్‌ వద్ద జెండా ఊపి ఈ సేవలను ప్రారంభించారు. దీంతో హైటెక్‌సిటీ, రాయదుర్గం మార్గం అందుబాటులోకి రానుంది. ఐటీ కారిడార్ మెట్రో ద్వారా 40 వేల మంది ప్రయాణించే అవకాశం ఉంది. నాగోల్, రాయదుర్గం మధ్య 29 కిలోమీటర్ల దూరం ఉంది.

తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/