‘వైఎస్‌ఆర్‌ వాహనమిత్ర’ రెండో విడత ప్రారంభించిన సిఎం

Launching of YSR Vahana Mitra Scheme(2nd Year) by Hon”ble CM of AP

తాడేపల్లి: సిఎం జగన్‌ వైఎస్‌ఆర్‌ వాహన మిత్ర రెండో విడత కార్యక్రమాన్ని ప్రారంభించారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి కంప్యూటర్‌ బటన్‌ నొక్కి నేరుగా రూ.262.49 కోట్లను లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేశారు. ఆటో, ట్యాక్సీ ఉన్న 2,62,493 మంది లబ్దిదారులకు రెండో విడతగా రూ.10వేలు ఆర్ధిక సాయం అందనుంది. ఆటో, ట్యాక్సీ కార్మికులను ఉద్దేశించి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ఈ సందర్భంగా సిఎం జగన్‌ మాట్లాడుతూ..ప్రజాసంకల్పయాత్రలో భాగంగా ఆటో, ట్యాక్సీ డ్రైవర్ల కష్టాలను స్వయంగా చూశానన్నారు. ఇచ్చిన మాట ప్రకారం నాలుగు నెలల ముందుగానే కార్మికులకు రెండో విడత ఆర్థిక సాయం అందిస్తున్నట్లు తెలిపారు. గతంలో జరిమానాలతో కార్మికులు అనేక ఇబ్బందులు పడిన విషయాన్ని గుర్తుచేశారు. మద్యం సేవించి వాహనాలు నడపవద్దని విజ్ఞప్తి చేస్తున్నట్లు తెలిపారు. వైఎస్‌ఆర్‌ వాహనమిత్ర పథకానికి అర్హత ఉండి సాయం అందని వారు స్పందన యాప్‌లో నమోదు చేసుకోవాలని సిఎం జగన్‌ సూచించారు.


తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/international-news/