ఐదు ఆయుధాలతో కరోనాపై యుద్ధం..సిఎం

టెస్టింగ్, సర్వే, స్క్రీనింగ్ ను ముమ్మరం చేస్తాం

YouTube video

న్యూఢిల్లీ: ఢిల్లీలో కరోనా మహమ్మారి రోజురోజుకు విజృంభిస్తుంది.ఈ నేపథ్యంలో మహమ్మారిని ఎదుర్కొనేందుకు ఐదు అంశాలను ఆయుధాలుగా చేసుకొని కరోనాపై పోరాటంతో ముందుకెళ్తామని ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ చెప్పారు. నగరంలో కరోనా పేషెంట్ల కోసం 13,500 హాస్పిటల్ బెడ్స్ అందుబాటులో ఉన్నాయని తెలిపారు. ప్రతి వీధిలో టెస్టులు జరుగుతున్నాయని చెప్పారు. ఆస్పత్రుల్లో రోగులకు పడకలు పెంచడం, టెస్టింగ్‌ ఐసోలేషన్‌, ఆక్సీమీటర్ల పంపీణీ, ప్లాస్మా థెరఫీ, ఇంటింటి సర్వే స్క్రీనింగ్‌ పరీక్షలు నిర్వహణ .. ఈఐదు అంశాలను ఆయుధాలుగా చేసుకొని కరోనాపై ముందుకేళ్తున్నట్టు సిఎం తెలిపారు.


తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/