ఆప్కాస్‌ను ప్రారంభించిన సిఎం జగన్‌

Inauguration of APCOS by Hon’ble CM of AP at CM Camp Office, Tadepalli

అమరావతి: సిఎం జగన్‌ రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటు చేసిన కార్పొరేషన్‌ ఫర్‌ ఔట్‌ సోర్స్‌డ్‌ సర్వీసెస్‌(ఆప్కాస్‌)ను శుక్రవారం తాడిపల్లి క్యాంపు కార్యాలయంలో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ప్రారంభించారు. స్కిల్డ్‌, సెమీ స్కిల్డ్‌, అన్‌ స్కిల్డ్‌ మ్యాన్‌పవర్‌ను గుర్తించి వివిధ శాఖలు, సంస్థల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయనున్నారు. ఆప్కాస్‌లో నియమించబడ్డ వారికి ఈపీఎఫ్‌, ఈఎస్‌ఐ లాంటి సదుపాయాలు కల్పిస్తున్నారు. ఈ సందర్భంగా సిఎం జగన్‌ మాట్లాడుతూ రాష్ట్రంలో 47 వేల మందికి పైగా ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులకు లబ్ధి జరుగనుందని తెలిపారు. ఉద్యోగాల నియమకాల్లో లంచాల మాట ఉండకూడదని అన్నారు. తాను చేపట్టిన పాదయాత్రలో ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులు అనేక సమస్యలను విన్నవించుకున్నారని వివరించారు. ఆప్కాస్‌ ఏ మాత్రం లాభాపేక్ష లేకుండా పనిచేస్తుందని వెల్లడించారు. ఇప్పటికే ఔట్‌ సోర్సింగ్‌ ద్వారా పనిచేస్తున్న ఉద్యోగులను తొలగించబోమని స్పష్టం చేశారు. రిజర్వేషన్ల ప్రకారం నియమకాలు ఉంటాయని, మహిళలకు 50 శాతం రిజర్వేషన్‌ వర్తిస్తుందని సీఎం స్పష్టం చేశారు.


తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/