ఎంఎస్‌ఎంఈలకు రెండో దశ ఆర్థిక సహాయం

YouTube video
Disbursing of Second Phase Financial Assistance to MSMEs by Hon’ble CM of AP at Camp Office

అమరావతి: సిఎం జగన్‌ నేడు తన క్యాంపు ఆఫీసులో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ఎంఎస్‌ఎంఈలకు రెండో విడత బకాయిల చెల్లింపు కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈనేపథ్యంలో సిఎం జగన్‌ లబ్ధిదారులతో మాట్లాడుతున్నారు. లాక్‌డౌన్‌తో తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న ఎంఎస్‌ఎంఈలు గట్టెక్కేందుకు తిరిగి కంపెనీలు ప్రారంభమయ్యేలా ఏపి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. కరోనా లాక్‌డౌన్‌ వల్ల కష్టాల్లో ఉన్న ఎంఎస్‌ఎంఈలకు గత టిడిపి ప్రభుత్వం చెల్లించని బకాయిలను జగన్… నేరుగా ఆయా కంపెనీల బ్యాంక్ అకౌంట్లలో జమ చేయిస్తారు. రీస్టార్ట్‌ కార్యక్రమంలో భాగంగా 7717 పరిశ్రమలకు అందాల్సిన బకాయిల్లో తొలివిడత మే 22న విడుదల చేశారు. నేడు మిగతా అమౌంట్ ఇవ్వబోతున్నారు. ఈ పరిశ్రమల్లో 2435 పరిశ్రమలకు సంబంధించిన ఎస్సీ, ఎస్టీ పారిశ్రామిక వేత్తలకు ప్రయోజనం కలగనుంది.


తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/