రెండు రోజుల్లో ప్లాస్మా బ్యాంక్‌ ఏర్పాటు

YouTube video
Delhi government is starting plasma bank

న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో కరోనా విలయతాండవం చేస్తుంది. దీంతో ఢిల్లీ ప్రభుత్వం పలు చర్యలు చేపడుతోంది. అతిపెద్ద కోవిడ్‌19 సెంటర్‌ను ఏర్పాటు చేయడంతో పాటు ఇంటింటి సర్వేను ముమ్మరంగా నిర్వహిస్తోంది. ఇక కరోనా రోగుల చికిత్స కోసం ఢిల్లీలో ప్లాస్మా బ్యాంక్‌ను ఏర్పాటు చేయనున్నట్టు సిఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ ప్రకటించారు. రెండు రోజుల్లో ప్లాస్మా బ్యాంక్‌ అందుబాటులోకి వస్తుందని చెప్పారు. కరోనా నుంచి కోలుకున్న రోగులు ప్లాస్మాను దానం చేయాలని ఆయన కోరారు. కరోనా మహమ్మారితో మరణించిన డాక్టర్‌ అసీం గుప్తా కుటుంబానికి కేజ్రీవాల్‌ రూ కోటి పరిహారం ప్రకటించారు. ఢిల్లీలో 29 మంది కరోనా రోగులపై ప్లాస్మా థెరఫీ క్లినికల్‌ ట్రయల్స్‌ నిర్వహించగా మెరుగైన ఫలితాలు వచ్చాయని చెప్పారు. ప్లాస్మా దాతలు, అవసరమైన రోగుల మధ్య ప్లాస్మా బ్యాంక్‌ సంథానకర్తగా వ్యవహరిస్తుందని కేజ్రీవాల్‌ తెలిపారు. ఇక ఢిల్లీలో ఇప్పటివరకూ 83,077 కరోనా పాజిటివ్‌ కేసులలు వెలుగుచూశాయి.


తాజా కరోనాలాక్‌డౌన్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/corona-lock-down-updates/