పండుగ బోనస్‌ ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం

YouTube video
Cabinet Briefing by Union Minister Prakash Javadekar

న్యూఢిల్లీ: కేంద్ర ప్ర‌భుత్వం ద‌స‌రా పండుగ సంద‌ర్భంగా నేడు బోన‌స్ ప్ర‌క‌టించింది. కేంద్ర క్యాబినెట్ తీసుకున్న నిర్ణ‌యాల‌ను కేంద్ర మంత్రి ప్ర‌కాశ్ జ‌వ‌దేక‌ర్ మీడియాతో వెల్ల‌డించారు. 2019-2020 సంవ‌త్స‌రానికి ప్రొడ‌క్టివిటీ, నాన్‌ప్రొడ‌క్టివిటీ రూపంలో బోన‌స్ ఇచ్చేందుకు కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలిపిన‌ట్లు మంత్రి చెప్పారు. బోన‌స్ ప్ర‌క‌ట‌న వ‌ల్ల సుమారు 30 ల‌క్ష‌ల నాన్‌గెజిటెడ్ ఉద్యోగులు ల‌బ్ధి పొందే అవ‌కాశం ఉన్న‌ట్లు మంత్రి వెల్ల‌డించారు. దీని వ‌ల్ల ప్ర‌భుత్వ ఖ‌జానాపై సుమారు 3737 కోట్ల భారం ప‌డ‌నున్న‌ట్లు ఆయ‌న తెలిపారు. బోన‌స్‌ను సింగిల్ ఇన్‌స్టాల్మెంట్ ప‌ద్ధ‌తిలో ఇవ్వ‌నున్నారు. విజ‌య‌ద‌శ‌మిలోగా నేరుగా ఆ మొత్తాన్ని బ‌దిలీ చేయ‌నున్న‌ట్లు మంత్రి తెలిపారు. మంత్రి మండ‌లి స‌మావేశంలో తీసుకున్న ఇత‌ర నిర్ణ‌యాల గురించి కూడా జ‌వ‌దేక‌ర్ ప్ర‌క‌ట‌న చేశారు. జ‌మ్మూక‌శ్మీర్ పంచాయ‌తీ రాజ్ చ‌ట్టాన్ని ఆమోదించిన‌ట్లు చెప్పారు. ఈ చ‌ట్టం వ‌ల్ల ఇత‌ర రాష్ట్రాల త‌ర‌హాలో క‌శ్మీర్‌లోనూ ప్ర‌జాస్వామ్యం వ‌ర్థిల్లుతుంద‌న్నారు. రైల్వే, పోస్ట‌ల్‌, ఈపీఎఫ్‌వో లాంటి కేంద్ర ప్ర‌భుత్వ సంస్థ ఉద్యోగుల‌కు వారంలోగా బోన‌స్ అందిచ‌నున్నారు.


తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/