మెదక్ కలెక్టర్ ఫై కేసు పెడతాం అంటూ ఈటెల భార్య సంచలన వ్యాఖ్యలు

మెద‌క్ క‌లెక్ట‌ర్ హరీశ్‌ ఫై ఈటెల రాజేందర్ భార్య జామున ఫైర్ అయ్యారు. జమున హేచరీస్‌ భూములపై కలెక్టర్‌ హరీశ్‌ ప్రెస్‌మీట్‌ పెట్టడానికి ఆయనకు ఏం అధికారం ఉందని జమున ప్రశ్నించారు. ఈ భూములకు సంబంధించిన పూర్తి వివరాలను కోర్టు ముందు ఉంచినట్లు తెలిపారు. అధికారులు వచ్చి మళ్లీ సర్వే చేసినప్పుడు కనీస వివరాలు కూడా తమకు ఇవ్వలేదన్నారు. కలెక్టరే నేరుగా విలేకరుల సమావేశం నిర్వహించి.. ఆక్రమించుకున్నారని ఎలా ఆరోపిస్తారని నిలదీశారు. ‘కలెక్టర్‌ ఏమైనా రాజకీయ నాయకుడా? టీఆర్ఎస్ ప్రభుత్వానికి క్లర్క్‌గా పనిచేస్తున్నారా..’ అంటూ జమున ప్రశ్నించారు. కలెక్టర్ టీఆర్ఎస్ కండువా కప్పుకుని మాట్లాడితే బాగుంటుందన్నారు.

70 ఎకరాలు ఆక్రమించుకున్నామంటోన్న కలెక్టర్‌పై ఖచ్చితంగా కేసులు పెడతామని ఈటల రాజేందర్ సతీమణి జమున హెచ్చరించారు. మాసాయిపేట మండలం అచ్చంపేట, హకీంపేట్ పరిధిలో అసైన్డ్ భూములను జమునా హ్యాచరీస్ కబ్జా వాస్తవమేనని మెదక్ జిల్లా కలెక్టర్ హరీశ్ మీడియా సమావేశంలో స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో స్పందించిన జమున… కలెక్టర్ టీఆర్ఎస్ కండువా కప్పుకుని మాట్లాడితే బాగుంటుందన్నారు. ‘‘మా వ్యాపారాలకు అనుమతులు ఇవ్వదొద్దని పెద్దలు చెప్పిన్లటు అధికారులే చెప్తున్నారు. చాలా మంది మంత్రుల పౌల్ట్రీ ఫాంలకు పొల్యూషన్ సర్టిఫికేట్స్ ఉన్నాయా?. ఈటల టీఆర్ఎస్‌లో ఉన్నప్పుడు ఒకలా.. బయటకొచ్చినాక మరొకలా వ్యవహరిస్తున్నారు. మా భూముల్లో పెద్ద షెడ్డులు వేసుకుంటే తప్పేంటి?.’’ అని జమున ప్రశ్నించారు. నిజానికి ఈ భుమ‌ల విష‌యం లో ఎలాంటి స‌మ‌స్య‌లు లేవ‌ని ప్ర‌భుత్వ వెబ్ సైట్ ధ‌ర‌ణి లో రికార్డు అయి ఉంద‌ని గుర్తు చేశారు. త‌మ భుమ‌లన్నీ కూడా లీగ‌ల్ గా రికార్డు అయి ఉన్నాయ‌ని స్ప‌ష్టం చేశారు. అసలు 2019 లో తాము భూముల‌ను కొనుగోలు చేయ‌లేమ‌ని స్ప‌ష్టం చేశారు. గ‌తంలో ఎప్పుడు రానీ ఈ వ్య‌వ‌హారం ఇప్పుడే ఎందుకు వ‌స్తుంద‌ని ప్ర‌శ్నించారు. రాజ‌కీయం ఒంట‌రి చేయ‌డానికి టీఆర్ఎస్ నాయ‌కులు ఆడుతున్న నాట‌క‌మ‌ని అన్నారు.