పెళ్ళైన మూడు రోజులకే తిరిగిరాని లోకాలకు వెళ్లిన నవ వధువు..

పెళ్ళైన మూడు రోజులకే తిరిగిరాని లోకాలకు వెళ్లిన నవ వధువు..

ఎంతో సంబరంగా అమ్మాయి పెళ్లి చేశామని..మంచి భర్త , అత్తామామ దొరికారాని సంబరపడ్డారో లేదో..మృతువు కారు రూపంలో వచ్చి నవ వధువు ను , ఆమె తండ్రిని మింగేసింది. ఈ ఘటన నిర్మల్ లో చోటుచేసుకుంది.

వివరాల్లోకి వెళ్తే..

కడెం మండలంలోని మద్దిపడగ గ్రామానికి చెందిన మౌనిక అనే యువతికి ఆగస్ట్ 25 న మహారాష్ట్రకు చెందిన యువకుడితో వివాహం జరిగింది. బల్లార్షాలోని వరుడి ఇంటి వద్ద వివాహ రిసెప్షన్ ముగించుకుని శనివారం తెల్లవారుజామున ఇంటికి కారు లో వస్తుండగా..నిర్మల్ జిల్లా కడెం మండలం పండవపూర్ సమీపంలో కారు అదువు తప్పి లోయలో పడిపోయింది. ఈ ప్రమాదంలో నవ వధువుతో పాటు ఆమె తండ్రి మృతి చెందారు. పెళ్ళైన మూడు రోజుల్లోనే నవ వధువు, ఆమె తండ్రి మృతి చెందడంతో పెళ్లింట విషాదం నెలకొంది. అత్తింటికి వెళ్లి పుట్టింటి తిరిగొస్తూ కానరాని లోకాలకు వెళ్లిందని కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరు అవుతున్నారు. డ్రైవర్ నిద్రమత్తు వల్లే ప్రమాదం జరిగినట్టు భావిస్తున్నారు.