102 రోజుల త‌ర్వాత న్యూజీలాండ్‌లో తొలి కేసు

మొత్తం క‌రోనా‌ కేసుల సంఖ్య 1220

102 రోజుల త‌ర్వాత న్యూజీలాండ్‌లో తొలి కేసు
new zealand-corona virus

న్యూజీలాండ్‌: న్యూజీలాండ్‌లో మరోసారి కరోనావైరస్ ఆన‌వాళ్లు బయటపడ్డాయి. 102 రోజుల త‌ర్వాత అక్కడ మళ్లీ కొత్తగా తొలి క‌రోనా కేసు నమోదైంది. మంగళవారం నమోదైన కొత్త‌ కేసుతో క‌లిపి ప్ర‌స్తుతం ఆ దేశంలో మిగిలి ఉన్న మొత్తం యాక్టివ్‌‌ కేసుల సంఖ్య 22కు చేరింది. తాజాగా కరోనా సోకిన వ్యక్తి జూలై 30న‌‌ మెల్‌బోర్న్‌ నుంచి న్యూజీలాండ్‌కు వచ్చిన‌ట్లు ఆ దేశ ఆరోగ్య మంత్రిత్వశాఖ తెలిపింది. హోమ్‌ ఐసోలేషన్‌లో ఉన్న ఆ వ్యక్తికి తొలుత నిర్వ‌హించిన‌ కరోనా నిర్ధారణ పరీక్షల్లో నెగెటివ్‌ వచ్చిందట‌. తొమ్మిది రోజుల అనంతరం మళ్లీ పరీక్షచేస్తే పాజిటివ్‌ అని తేలింది. తాజా కేసుతో క‌లిపి న్యూజీలాండ్‌లో ఇప్ప‌టివ‌ర‌కు న‌మోదైన‌ మొత్తం క‌రోనా‌ కేసుల సంఖ్య 1220కి చేరింది. 

తాజా జాతీయ వార్తల కోసం : https://www.vaartha.com/news/national/